నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుకున్నారా.. ఈ వంటింటి చిట్కాలు బెస్ట్ ఆప్షన్!

lakhmi saranya
చాలామందికి నోరు దురవాసన అనేది మరీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. దుర్వాసన రాకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కానీ దుర్వాసన అనేది వస్తుంది. నోటి దుర్వాసన ఇబ్బందికి కారణం అవుతుంది. నోటి దుర్వాసనతో బాధపడే వారు ఎవరితోనైనా మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడతారు. ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం చెడు ఆహారపు అలవాట్లు అని చెప్పవచ్చు. అంతే కాదు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయకపోవడం, నాలుకను శుభ్రం చేసుకోకపోవడం, రాత్రి బ్రష్ చెయ్యకుండా నిద్రపోవటం అంటే చెడు అలవాట్లు నోటి దుర్వాసనకు కారణం అవుతాయి.
 అయితే శ్వాసను తాజాగా ఉంచడానికి మార్కెట్లో అనేక రకాల మౌత్ ఫ్రెషనర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంటిలో ఉండే కొన్ని వస్తువులతో నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చు. ఈరోజు కొన్ని హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం... ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటే.. ఈ చిట్కాలు ఉపయోగించి నోటి దుర్వాసనను తగ్గించుకోండి. రోజుకు రెండుసార్లు బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటే సోపు లేదా యాలకులను ఉపయోగించవచ్చు. ప్రతిరోజు ఆహారం తిన్న తర్వాత సొపు లేదా యాలకులను తినాలి.
 ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన రాదు. సోంపు, యాలకులు సహజమైన మౌత్ ఫ్రెషనర్లుగా పనిచేస్తాయి. నోటి దుర్వాసనకు పుదీనా చాలా మేలు చేస్తుంది. సోంపు, యాలకులు వలనే పుదీనా కూడా సహజమైన మౌత్ ఫ్రెషనర్ గా పని చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఆహారం తిన్న తర్వాత పుదీనా ఆకులను నమలాలి. ఇది నోటి నుంచి వచ్చే చెడు వాసనను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనను తగ్గించడంలో లవంగాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. లవంగాలు తినడం వల్ల నోటి దుర్వాసన కూడా తొలగిపోతుంది. లవంగాలలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి నోటిలోని చెడు బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడతాయి. యాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: