మూడు పూటలు అన్నం తింటే మంచిదేనా.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
లేదంటే అనేక రకాల అనారోగ్య సమస్యల భారం పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవలి జరిగిన అధ్యయనం ప్రకారం, ఎక్కువగా అన్నం తినడం వల్ల కొంతమందిలో వివిధ దీర్ఘకాలిక వ్యాధులు సంభవిస్తాయని తేలింది. అన్నం ఎక్కువగా తినేవారి శరీరంలో కార్బోహైడ్రేట్స్ విపరీతంగా పెరిగి శరీర బరువు పెరిగే కొద్దీ కొవ్వు శాతం రెట్టింపు అవుతుంది. తద్వారా ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. అంతేకాకుండా రోజుకు 3 సార్లు తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం మెండుగా ఉంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడే వారికి రక్తంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అది మాత్రమే కాకుండా, అన్నం ఎక్కువగా తినడం వల్ల పలు రకాల జీర్ణ సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అన్నం ఎక్కువగా తినడం వల్ల అజీర్ణం, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు సంభవిస్తాయి. ఇప్పటికే పొట్ట సమస్యలతో బాధపడేవారు అన్నం ఎక్కువగా తినకుండా ఉండడమే మంచిది అని అంటున్నారు. ఇక అన్నం ఎక్కువగా తినడం వలన గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే శరీరంలో అకస్మాత్తుగా షుగర్ లెవెల్, కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. కొందరిలో అన్నం ఎక్కువగా తినడం వల్ల కాలేయం దెబ్బతినడంతోపాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.