గుడ్ రీడింగ్ స్కిల్స్ ఉన్నవారి బ్రెయిన్ డిఫరెంట్ గా ఉంటుంది..? కారణం ఇదే..!

lakhmi saranya
చాలామంది ఉదయం లేచిన వెంటనే పుస్తకాలను ఎక్కువగా చదువుతూ ఉంటారు. ఇలా చదువుకోవటం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుంది. చదువంటే కేవలం బట్టి పట్టి చదవటం సరైంది కాదు. నిజానికి ఇలాంటి చదువు వల్ల ఉపయోగం లేదంటున్నారు నిపుణులు. అప్పటి పూర్తికి మార్కులు పెంచుకోవడానికి ఉపయోగపడవచ్చు. కానీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడంలో మాత్రం సహాయపడదు. పైగా బట్టి పట్టిన విషయాలు సుదీర్ఘకాలం గుర్తుండవు. అదే ఆసక్తికొద్ది... అవగాహన చేసుకుంటూ చదవడం, సరదాగా చదవటం వంటివి జీవితంలో గుర్తుంటాయి.
 అయితే ప్రస్తుతం ఇలా చదివే వారి సంఖ్య పడిపోతోందని యూకేకు చెందిన రిడింగ్ ఏజెన్సీ ఆధ్యాయ నమోలో వెళ్లడైంది. పైగా అడల్ట్స్ లో 50 శాతం మంది రెగ్యులర్గా చదవడం లేదు. అవసరం కోసం బట్టి పడుతున్నారు. అలాగే 16 నుంచి 24 ఏండ్ల వయసుగల ప్రతి నలుగురిలో ఒకరు సరైన రిడర్స్ గా ఉండటం లేదు. చదువుల్లో స్కిల్స్ ఎలా అలవడుతాయి? ఎలా చదివితే బాగా గుర్తుంటుంది అనే విషయాలను తెలుసుకోవటానికి యూకే రిడింగ్ ఏజెన్సీ పరిశోధకులు 1000 మందిని పరిశీలించారు. వారికి సంబంధించిన ఓపెన్ స్టోర్స్ డేటాను విశ్లేషించారు. బట్టి పట్టి చదవటం కంటే సరదాగా చదవడం, చూస్తూ చదవడం, వీడియోలను వినడం వంటివి మెదడుపై సానుకూల ప్రభావాన్ని కలిగిస్తున్నట్లు గుర్తించారు.
 కాగా ఈ సందర్భంగా వారు బ్రెయిన్ అనాటమీలో విభిన్న సామర్ధ్యాలున్న రీడర్స్ విభిన్న లక్షణాలను కూడా కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. న్యూరో ఇమేజ్ లో పబ్లిషైన నీ కొత్త ఆధ్యాయన వివరాల ప్రకారం.. చదువులో నైపుణ్యం కలిగి ఉంటున్న వారి మెదడు భాగాన్ని పరిశీలించినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెళ్లడయ్యాయి. గుడ్ రీడర్స్ బ్రెయిన్ ఎడమ అర్ధగోళంలో భాషకు సంబంధించిన కీలకమైన రెండు ప్రాంతాల నిర్మాణం ఉంటుంది. చదువులో నైపుణ్యం కలిగి ఉన్న వ్యక్తుల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వాటిలో ఒకటి టెంపొరల్ లోబ్ పూర్వ భాగం. కాగా ఇది వివిధ రకాల అర్థవంతమైన సమాచారాన్ని గ్రహించడానికి, వర్నికరించడానికి సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: