వింటర్ లో గొంతు నొప్పి... నిర్లక్ష్యం చేస్తే జరిగేది ఇదే..!

lakhmi saranya
వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. చలికాలం వస్తే గొంతునొప్పి లేదా దగ్గు లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. చలికాలంలో సాధారణంగా తలెత్తే సమస్యల్లో గొంతు నొప్పి ఒకటి. చిన్న సమస్య కదా అని నిర్లక్ష్యం చేస్తే.. కొన్నిసార్లు అది పెద్దగా మారవచ్చు. ముఖ్యంగా వింటర్లో గొంతు నొప్పి విషయంలో అది జరిగే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా ఈ సీజన్లో వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాలతో గొంతు నొప్పి సహా దగ్గు, జలుబు, కొన్ని రకాల అలర్జీలు వస్తుంటాయి.
 ముఖ్యంగా మోనోన్యూక్లియోసిస్ వంటి వైరస్ లు గొంతు ఇన్ఫెక్షన్ కు కారణం అవుతాయి. ఇంకా ఏవో సమస్యలు తలెత్తుతాయో చూద్దాం. గొంతు నొప్పి రావడానికి ప్రధాన కారణాల్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఒక కారణం. దీని కారణంగా గొంతు ఎర్రబడడం, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. దీనిని ఎలక్షన్ చేస్తే రుమాటిక్ ఫీవర్, కిడ్నీలో చీము, నెఫ్రైటెస్ వంటి సమస్యలకు కారణం అవుతోంది. అందుకే ఎక్కువ రోజులు గొంతు సమస్య ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. దీర్ఘకాలం పాటు గొంతు సమస్య ఉన్నట్లయితే అది క్యాన్సర్ కు దారితీయవచ్చు. సాధారణంగా ఇది ఫారింక్స్ లేదా టాన్సిల్స్ నుండి ఏర్పడుతుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పొడి దగ్గు, మింగడం కష్టంమనిపించడం, వాయిస్ మారిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. దీనిని నిర్లక్ష్యం చేసినట్లయితే, పదాలు, బుగ్గలు, చిగుళ్ళు, అంగిలి, టాన్సిల్స్, నాలుకకు విస్తరించవచ్చు. అలాగే తీవ్రమైన ఎలర్జీలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. గొంతు నొప్పి ఉన్నవారు నారింజ, నిమ్మ వంటి పుల్లటి పదార్థాలు తీసుకోకూడదు. ఇది గొంతులో మరింత అసౌకర్యం ను కలిగించే ప్రమాదం ఉంది. చాలామంది గొంతు నొప్పిని లెక్కచేయకుండా ఐస్ క్రీమ్, శీతల పానీయాలు, పెరుగు, వేయించిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారు. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని తగ్గిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: