నోటి దుర్వాసనకు అసలు కారణాలేంటో తెలుసా..!

lakhmi saranya

చాలామందికి నోటి దుర్వాసన అనేది మరీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే చాలా రకాల చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. ఒక్కోసారి ఎవరి నోటి నుంచి అయినా దుర్వాసన వస్తూ ఉంటుంది. పళ్ళు సరిగ్గా దోమకపోయినా, నాలుక శుభ్రం చేయకపోయినా నోటి నుంచి దుర్వాసన రావడం కామన్. ఇలా తరచూ ఉండే మాత్రం అటకచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటే ఇతరులతో మాట్లాడటం కష్టంగా ఉంటుంది. నోటి దుర్వాసనకు చాలా కారణాలు ఉన్నాయి. పళ్లకు ఆహారం ముక్కలు ఇరుక్కున్నా కూడా వాసన వస్తుంది.
కాబట్టి నోటి దుర్వాసన వచ్చేవారు ఫ్లాసింగ్ చేసుకోవాలి. ప్రతిరోజు రెండుసార్లు బ్రష్ చేయటం వల్ల దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. ధూమపానం కారణంగా కూడా నోటి దుర్వాసన వస్తుంది. కాబట్టి దోమపానం కంట్రోల్ చేసుకోవాలి. చిగుళ్ళు పాడైపోయిన, పిప్పళ్లు ఉన్నా కూడా క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం. చిగుళ్ళు సమస్యలు, సైనస్ ఇన్ఫెక్షన్, కిడ్నీలో సమస్యలు ఉన్నా కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసన ఎక్కువ రోజులు వస్తే మాత్రం... కచ్చితంగా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. జీర్ణ సమస్యల కారణంగా కూడా నోటి దుర్వాసన రావచ్చు.
కాబట్టి సమస్య కేవలం నోటి నుంచే కాదు.. శరీరంలోని ఇతర భాగాల కారణం గా కూడా వస్తుంది. తులసి, పుదీనా తరచూ నములుతూ ఉండండి. నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. కాబట్టి నోరు దుర్వాసన రాకుండా ఉండాలంటే రెండు పూట్ల కూడా బ్రష్ చేస్తూ ఉండాలి. ఉదయం సాయంత్రం బ్రష్ చేయటం వల్ల దురవాసన అనేది కొంచెం తగ్గుతుంది. మరి ఎక్కువగా వస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. తక్కువగా వస్తూ ఉంటే తులసి ఆకులను నోట్లో నములుతూ ఉండాలి. ఇలా చెయ్యటం వల్ల నోరు దుర్వాసన నుంచి బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: