2024 లో వీళ్లు చాలా ఫేమస్.. గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసింది వీరి గురించే...!

lakhmi saranya
ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ తెలియని విషయం ఏదన్నా ఉంటే గూగుల్లో వెంటనే సెర్చ్ చేసేస్తున్నారు. గూగుల్ అంటేనే సమాచార సర్వసం..వరల్డ్ మెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ కూడా అదే. మనకు ఏ డౌట్ వచ్చినా వెంటనే సెర్చ్ ఇంజిన్ లో టైప్ చేస్తే చాలు.. కావాల్సిన సమాచారం క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా గూగుల్లో ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసిన ఫేమస్ పర్సన్ ఎవరనే విషయాన్ని ఈ టెక్ దిగ్గజం వెల్లడించింది.
ఇందులో ఫస్ట్ రెండు స్థానాల్లో డోనాల్డ్ ట్రంప్, కేట్ విడిల్టన్ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ అయిన మిడిల్లన్ మొదటి, రెండవ స్థానాల్లో ఫేమస్ పర్సన్స్ గా ప్రజాదరణ  పొందటం వెనుక చాలా కారణాలే ఉన్నాయంటున్నారు నిపుణులు. ఈ ఏడాది వీరి జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన పరిణామాలు అందుకు దోహదం చేశాయి. అందరికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచేందుకు, మరింత ప్రజాదరణ పొందేందుకు కారణం అయ్యాయి... అవేమిటంటే... ట్రంప్ ఎన్నికల ప్రచారంలో హత్యాయత్నం నుంచి తప్పించుకోగా, కేట్ ప్రాణాంతక క్యాన్సర్ తో పోరాడి విజయం సాధించారు.
ఈ రెండు అంశాలు ప్రజల్లో వారి పట్ల సానుభూతికి, ఎక్కువ ఆదరణకు కారణం అయ్యాయి. 2024 జులై 13 న పెన్సిల్వేనియాలోని బట్లర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ పై ఓ వ్యక్తి కల్పులు జరపగా, బుల్లెట్ ఆయన కుడి చెవిని తాకుతూ దూసుకుపోయింది. ఆ సమయంలో రక్తం కారుతున్న ట్రంప్ భయపడలేదు. పిడికిలి పైకెత్తి తన ధైర్యాన్ని ప్రదర్శించడం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. ఆ తర్వాత ఆయన విజయం సాధించారు. కాగా చాలామంది ఆన్ లైన్ లో ట్రంప్ అస్సాస్సినేషన్ అట్టెంప్ట్ అని సెర్చ్ చేశారు. దీంతో ఇది మోస్ట్ సెర్చ్ డ్ వర్ట్ గా ట్రంప్ మెస్ట్ ఫేమస్ పర్సన్ గా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: