జుట్టు బత్తుగా పొడవుగా పెరగాలనుకుంటున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి..!

lakhmi saranya
చాలామంది జుట్టు పొడవుగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఎన్ని చిట్కాలు పాటించిన కానీ జుట్టు అనేది మాత్రం అసలు పెరగదు. ప్రస్తుత కాలంలో జుట్టు ఊడిపోవటం అనే సమస్యతో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. దీని కారణం మారినా జీవనశైలి, పెరిగిన ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం, రసాయన షాంపూల వాడకం వంటి అనేక సమస్యలు. జుట్టు పెరుగుదల కోసం మంచి నూనె, షాంపు, కండీషనర్ తో పాటు మంది ఆహారం తీసుకోవటం కూడా ముఖ్యం.

జుట్టు పెరుగుదల కోసం ఈ ఆహారాలలో కొన్నిటిని తీసుకోవటం చాలా అవసరం. కనుక జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకోండి. ఏం చేసినా జుట్టు రాలటం ఆగటం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అంతే కాదు చాలామంది తమ జుట్టును కాపాడుకోవడానికి డబ్బు ఖర్చు చేసి ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇది ఆ క్షణానికి మాత్రమే ఉపశమనం కలిగించగలదు. అయితే జుట్టు బాగా పెరగాలంటే తినే ఆహారంపై ఎక్కువ శ్రద్ధ ఉండాలి. జుట్టు పోషణ అందించే పొడవైన జుట్టు కోసం కొన్ని రకాల ఆహారాలను తినాలని నిపుణులు చెబుతున్నారు. పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, సి, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి.

ఐరన్ హెయిర్ ఫోలికల్స్ కు ఆక్సిజన్ ను అందించడంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరి లక్షణాలు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుడ్లలో ప్రోటీన్, బయోటిన్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ప్రోటీన్ జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. సాల్మన్ చేపలు ఒమేగా -3 ఫ్యాటి యాసిడ్స్, ప్రోటీన్లు, విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఒమేగా -3 ఫ్యాటి యాసిడ్ లు వెంట్రుకలు కుదుళ్లకు పోషణను అందించి, శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీంతో జుట్టు ఒత్తుగా, ఒత్తుగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: