మీకు కాఫీ తాగే అలవాటు ఉందా?.. ఇటువంటి వారికి విషయంతో సమానం..!
కొన్ని అధ్యాయానాలలో కూడా, పాలు చక్కెర లేని కాఫీ ఎక్కువగా కాలం జీవించడానికి ముడిపడి ఉందని నిరూపించాయి. అందుకే..కాఫీ తాగాలని కూడా సూచించాయి. ఎక్కువగా కాఫీ తాగటం మంచిది కాదని కూడా పేర్కొన్నాయి. కానీ, కొంతమందికి ఈ కాఫీ విషపూరితమైనదిగా నిరోపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కింద చెప్పబోయే 5 ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొనే వ్యక్తులకు కాఫీ మంచిది కాదని పేర్కొంటున్నారు. మీకు కూడా ఈ సమస్యలు ఉంటే, కాఫీ తాగి విషయంలో మరోసారి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. యాసిడ్ రిఫ్లక్స్ మీకు ఆసిడ్ రిఫ్లెక్స్ లేదా గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిప్లెక్స్ వ్యాధి సమస్య ఉంటే, అప్పుడు కాఫీ తీసుకోవటం వల్ల దాని లక్షణాలు మరింత పెరుగుతాయి. కాఫీలో ఉండే కెఫిన్, యాసిడ్స్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి. గుండెలో మంట, రిఫ్లెక్స్ అవకాశాలను పెంచుతాయి. దీని కారణంగా మీరు అసౌకర్యం, వాపు- ఛీతీ నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కాఫీలో ఉండే కెఫిన్ ఆందోళన లేదా నిద్రలేమితో బాధపడుతున్న రోగులకు హానికరం. టిఫిన్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది. ఇది హృదయ స్పందన పెరుగుదలకు దారితీస్తుంది. మరింత ఒత్తిడికి గురవుతుంది. ఇది కాకుండా, నిద్రపోయే ముందు కాఫీ తీసుకోవడం వల్ల కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. కాఫీ ఐరన్ శోేషణకు ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా ఆహారంతో తీసుకున్నప్పుడు, కాఫీలో ఉండే టానిన్ లు ఐరన్ తో బంధిస్తాయి... శరీరానికి శోషించబడకుండా నిరోధిస్తాయి. ఇది కాలక్రమేణా ఇనుము లోపానికి దారితీస్తుంది. మీరు ఇప్పటికే ఐరన్ లోపంతో బాధపడుతున్నట్లయితే, ఈ కాఫీ వినియోగంపై శ్రద్ధ వహించండి. గర్భధారణ సమయంలో కెఫీన్ ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే కెసి పిల్లల అభివృద్ధి, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. గర్భధారణ సమయంలో కెఫీన్ అధికంగా తీసుకోవడం వల్ల ముందస్తు జననం, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, గర్భాస్రావం అయ్యే ప్రమాదం ఉందని పరిశోధనలో తేలింది.