పన్నీర్‌కు ఎముక‌లు స్ట్రాంగ్ అవ్వ‌డానికి ఇంత లింక్ ఉందా..?

lakhmi saranya
చాలామంది పన్నీర్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. మరి కొంతమందికి మాత్రం పన్నీరు అంటే అసలు ఇష్టం ఉండదు. పనీర్ లో విటమిన్ డి, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి. పన్నీర్ ను తరచుగా మన డైట్ లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఆ లాభాలేమిటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్లో క్యాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఎముకల సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. పన్నీర్ శాకాహారులకు మంచి ప్రోటీన్..
ఇందులో ఉండే ప్రోటీన్ శరీరంలోని కణజాలాలను నిర్మించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. పన్నీర్లో క్యాల్షియం అధిక పరిమాణంలో ఉంటుంది. దీని కారణంగా శరీరానికి తగిన క్యాల్షియం లభిస్తుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఎముకలు బలహీన పడే వ్యాధులను దూరం చేస్తుంది. పన్నీర్ లో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. పన్నీర్ లో ఉండే గుణాలు మలబద్ధకం, అజీర్ణం వండి సమస్యలను తగ్గిస్తుంది. దీంతోపాటు పొట్ట సమస్యలు కూడా తగ్గుతాయి. బరువు తగ్గడానికి వ్యాయామాలు చేస్తున్న వారు తప్పకుండా ఆహారాల్లో పన్నీర్ వినియోగించాల్సి ఉంటుంది.
ఇలా చేస్తే బరువు తగ్గడమే కాకుండా కండరాలు దృఢంగా తయారవుతాయి. గుండె సమస్యలతో బాధపడే వారు కూడా క్రమం తన పన్నీర్ ను తినటం చాలా మంచిది. ఇందులో ఉండే కొన్ని మూలకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేస్తుంది. పన్నీర్ లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. సెరోటోనిన్ మన మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మానసిక సమస్యలు తగ్గుతాయి. పన్నీర్ లో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిట్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: