వింటర్లో నల్ల ద్రాక్ష తింటే.. శరీరంలో ఏమవుతుందో తెలుసా..?
అందువల్ల చలికాలం ప్రతిరోజు ఈ ద్రాక్షాను తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులు దరిచేరకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా సీజనల్ వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా ద్రాక్షను ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. నల్ల ద్రాక్షాలో విటమిన్ సి, విటమిన్ ఏ, బీ6, ఫాలీక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. నల్ల ద్రాక్షాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని నియంతరించడంలో సహాయపడుతుంది. నల్లటి ద్రాక్షాలు రక్తంలో నైట్రిన్ ఆక్సైడ్ మోతాదును పెంచుతాయి, నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా నివారిస్తాయి.
బరువు తగ్గటంలో సహాయపడుతుంది. కాయంతో బాధపడుతున్న వారు నల్ల ద్రాక్షను తరచుగా తీసుకుంటే... రక్తంలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా ఆపుతుంది. ఉబకాయం అంటే ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు. గుండెపోటు నివారణకు దోహాదపడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నల్ల ద్రాక్షలో ఉండే కొన్ని రకాల పోషకాలు క్యాన్సర్ కణాలతో పోరాడతాయి. నల్ల ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ గుండెలో పేరుకునే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి అక్కడి కండరాలకు మేలు చేస్తాయి. ద్రాక్షాలు ప్లేవనాయిడ్స్ లాంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయాలను తొలగిస్తాయి. యవ్వనంగా కనిపించేందుకు దోహాదం చేస్తుంది.