పెదాలు నల్లగా మారి పగిలిపోయాయా... ఈ చిట్కాలు ట్రై చెయండి..!

lakhmi saranya
కొంతమంది పెదాలు నల్లగా మారిపోతూ ఉంటాయి. గులాబీ రంగులోకి రావటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా కానీ పెదాలు నల్లగానే కనిపిస్తాయి. అందంగా కనిపించాలంటే కేవలం ముఖమే కాదు పెదాలు కూడా ఆకర్షణీయంగా ఉండాలి. అందాన్ని ఆకర్షించే గుణం పెదాలకు ఉంది. కేవలం ముఖంపై మాత్రమే కాకుండా పెదాలపై కూడా శ్రద్ధ పెట్టండి. చలికాలంలో మీ పెదాలు నల్లగా మారి పగిలిపోతే.. ఈ చిట్కాలను ట్రై చేయండి. ముఖం, జుట్టుపై పెట్టే శ్రద్ధ చాలా మంది లిప్స్ పై పెట్టారు. అందంగా కనిపించాలంటే లిప్స్ కూడా ముఖ్యమే. పెదాలు పగలటం వల్ల చిరాకుగా కనిపిస్తాయి. ఈ సమస్యలను చాలామంది ఫేస్ చేసే ఉంటారు. ఇందుకోసం డబ్బు ఖర్చు చేసి మరీ కాస్ట్ లీ లిప్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు.
వీటి వలన క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ధూమపానం, మధ్యపానం, వాతావరణ మార్పులు, అరుపు అలవాట్ల కారణంగా కూడా పెదాలు అనేవి నల్లగా మారుతూ ఉంటాయి. ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్న కూడా పెదాలు నల్లగా మారుతూ ఉంటాయి. చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడే ఉంటారు. ఇలాంటి సమస్యలతో బాధ పడేవారు ఇంటి వద్దనే ఈజీ చిట్కాలతో పెదాలను ఎర్రగా, అందంగా మార్చుకోవచ్చు. మరి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది మనకు ఈజీగా లభించే వస్తువులను పక్కకు పెట్టి ఖర్చు పెట్టి మరి కాస్ట్ లీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. మనకు ఈజీగా లభించే వాటిల్లో కొబ్బరి నూనె ఒకటి. రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాసి పడుకోండి. కొబ్బరి నూనెలు అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి పెదాలను మృదువుగా, కోమలంగా మార్చుతాయి. నెయ్య కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇందులో కూడా అనేక పోషకాలు ఉంటాయి. మీ పెదాలు నల్లగా మారి, పగిలి పోతే నెయ్యలో కొద్దిగా పంచదార కలిపి పెదాలపై రబ్ చేయండి. ఇలా ఓ రెండు నిమిషాలు చేసిన తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగండి. ఆ తర్వాత కొబ్బరి నూనె లేదా వాజెలీన్ లేదా లిప్ బామ్ రాసిన చాలు. పెదాలను అందంగా మార్చడంలో ఇంటి వద్దనే సిరమ్ కూడా తయారు చేసుకోవచ్చు. బయట కొని వాటిల్లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వలన అనేక వ్యాధులు రావచ్చు. పెదాలను ఎర్రగ, మృదువుగా అందంగా ఉండాలంటే ఈ చక్కటి చిట్కా ట్రై చేయండి. ముందుగా ఓ బవుల్లోకి కొద్దిగా స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ట్రై చేయండి. ఇందులో నిమ్మరసం నాలుగు చుక్కలు, ఆఫ్ స్పూన్ గ్లిజరిన్, కలబంద గుజ్జు వేసి అన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ విశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఈ సిరమ్ ని రోజుకు రెండుసార్లు పెదాలపై రాస్తూ ఉండండి. కొద్ది రోజులకే పెదాలు మృదువుగా, గులాబీ రంగులోకి మారుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: