భోజనం తరువాత పండ్లు తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

lakhmi saranya
డైలీ పండ్లను తినటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అన్న విషయం అందరికీ తెలిసింది. పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. భోజనం తిన్న తర్వాత పండ్లని తింటే మీ ఆరోగ్యం మరింత బాగుంటుంది. భోజనం చేసిన తర్వాత పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా? సరైన నియమాల ప్రకారం పండ్లు తినకపోతే, అది విషయం లాగా మారుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు పండ్లు తింటే రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆహారం తిన్న తర్వాత పండ్లు తింటే శరీరంలో టాక్సీన్స్ పేరుకు పోతాయి. కాళీ కడుపుతో నీళ్లు, కడుపు నిండా పండ్లు, తినవద్దు అని పెద్దలు చెబుతూ ఉంటారు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, శరీర రోగ నిరోధక శక్తిని పెంచడానికి పనులు కీలకం అని నిపుణులు చెబుతున్నారు. పండ్లను తినటం వల్ల చర్మం పై కూడా మెరుస్తుంది. పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సరైన నియమాల ప్రకారం పండ్లు తినకపోతే, అది విషయంలాగా మారుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు పండ్లు తింటే రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
ఆహారంతో పాటు పండ్లను తీసుకోవద్దని ఆయుర్వేద గ్రంధాలు చెబుతున్నాయి. భోజనం తర్వాత పండ్లు తినటం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి. నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి బండ్లు కడుపులో యాసిడ్ స్థాయిని పెంచుతాయి. ఫలితంగా ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. పుల్లటి పండ్లు రసాలు ఈ ఆమ్లాన్ని పెంచడానికి కారణం అవుతాయి. ఆహారం తిన్న తర్వాత పండు తినటం వల్ల తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. పండ్లలో ఉండే యాసిడ్, షుగర్ తలనొప్పి వంటి సమస్యలకు కారణం అవుతాయి. సిట్రస్ పండ్లలో ఆక్టోపమైన్ ఉంటుంది, ఇది తలనొప్పికి కారణం అవుతుంది. మైగ్రేన్ సమస్య ఉంటే, సిట్రస్ పండ్లు, అవకాడోస్, రాస్ప్బెర్రిస్, ప్లమ్స్, పండ్లు, డ్రై ఫ్రూట్స్ కు దూరంగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: