కొవ్వును కరిగించే జపనీస్ టెక్నిక్‌... ఇలా చేస్తే పొట్ట తగ్గటం ఖాయం..!

lakhmi saranya
కొంతమంది ఏమీ తినకపోయినా కానీ బరువు అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు. అలాంటివారు వ్యాయామాలు చేయడం మంచిది. వ్యాయామాలు చేయటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. సాధారణంగానే వ్యాయామాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సరైన ఫిట్ నెస్ కు దోహదం చేస్తాయి. అయితే ఇందులోనూ పలు రకాలు ఉన్నాయి. ఇండోర్ వర్కౌట్స్, ఔట్ డోర్ వర్కౌట్స్ తో పాటు ఇతర సాధారణ వ్యాయామాలు ఉంటాయి. ఒక్కో రకమైన వ్యాయామం ఒక్కో విధమైన ప్రయోజనాలు కలిగిస్తుంది. కాగా ఇటీవల జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులు, హార్మోన్ల అసమతుల్యత, ఫిజికల్ ఆక్టివిటీస్ వంటివి పలు సమస్యలకు కారణం అవుతున్నాయి.
ముఖ్యంగా శరీరంలో కొవ్వు పేరుకుపోవటం, పొట్ట పెరగటం వంటి ప్రాబ్లమ్స్ పలువురు ఫేస్ చేస్తున్నారు. అయితే కొన్ని జపానీస్ వ్యాయామాలు దీనికి చక్కటి పరిష్కారం చూపుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చాలామంది వర్క్ అవుట్లను రొటీన్ తో స్టోర్ట్ చేస్తారు. కానీ జపానీయులు మాత్రం 'రేడియో టైసో' అని ప్రత్యేక వ్యాయామాలతో ప్రారంభిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఎక్కువగా కాళ్లు, చేతులు వేగంగా కదిలిస్తూ... శరీరాన్ని ముందుకు, వెనక్కి వంచుతూ వ్యాయామాలు చేస్తారు. ఇది వివాధ శరీరా బాగాల్లోనే కాకుండా పొట్ట, నడుము చుట్టూ ఉండే కొవ్వు నువ్వు కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
ఒక విధంగా భారతీయ యోగాసనాలతో పోలి ఉంటాయని చెప్పారు. ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తాయి. ఎక్సర్సైజ్ అంటే నీ కొందరికి నీరసం వచ్చేస్తుంది. కానీ జపానీలు చేసే 'హూలాహూప్' వ్యాయామం లో మాత్రం అలా కాదు. నడుము చుట్టూ ఒక పెద్ద రింగ్ ధరించి దానిని కొనసాగిస్తారు. ఇది సరదా ఆటలా ఉంటుంది. ఈ వర్కౌట్ పొట్ట భాగంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆయా భాగాలు నాజూగ్గా మారుతాయి. కాళ్లు, చేతులు, కోర్ కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. తద్వారా ఫ్యాట్ కరిగి నాజుగ్గా మారుతారు. నేలపై వెల్లకిలా పడుకొని ముందుకు లేవటం, తిరిగి యథా స్థితికి రావడం.. వంటి భిన్నమైన యాంగిల్స్ లో చేసే జపనీస్ వ్యాయామమే 'seiza సిటప్స్'.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: