మ‌హిళ‌ల‌కు ఏ వ‌య‌స్సులో ఏ ఫుడ్ బెస్ట్ అంటే..?

lakhmi saranya
ఆరోగ్యం బాగుండాలంటే హెల్తీ ఫుడ్స్ ని తప్పకుండా తీసుకోవాలి. ఫ్రూట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా తింటూ ఉండాలి. మనం జీవించడానికి ఆహారం తప్పక అవసరం. అయితే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి మాత్రం తగిన పోషకాలు కలిగిన ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. శరీర తత్వాన్ని బట్టి, వయస్సును బట్టి కూడా పలు రకాల ఆహారాలు అవసరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఏ వయసులో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎదిగే వయసులో శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. అయితే ఈ జనరేషన్ ఎక్కువగా ఆసక్తి చూపుతున్న ఆహారాల్లో ఇది లోపిస్తోందని పోషకాహార నిపుణులు అంటున్నారు.
 బయట లభించే ఆహారాలు, వివిధ జంక్ ఫుడ్స్ ను కొందరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీటిల్లో పిండి పదార్థాలు, అధిక కొవ్వులు ఉండటం వల్ల ఒబేసిటీ, హార్మోన్ల ఆ సమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిల్లో 12 ఏండ్ల లోపు వయసులోనే రుతుక్రమం ప్రారంభం అవ్వడం ఈ మధ్య పెరుగుతుంది. హార్మోన్లలో అసమతుల్యత కూడా ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. ఇలాంటి సమస్యలు తలెత్త కూడదంటే.. 10 నుంచి 15 ఏండ్ల వయసులోపు వారు తీసుకునే డైట్ లో గుడ్లు, ఆకు కూరలు, తాజా పండ్లు, నట్స్, వేరుశనగ, పెసలు, గోధమ వంటిది ఉండేలా చూసుకోవాలి.
అలాగే బేకరీ ఫుడ్స్, స్వీట్లు, కేకులు, చాక్లెట్లకు ప్రత్యామ్నాయంగా ఫుడ్ సలాడ్లు, డ్రై ఫ్రూట్స్, నువ్వులు వంటివి ఆహారంలో భాగంగా తీసుకోవాలి. స్నాక్స్ ఎక్కువగా ఇష్టపడేవారు బొబ్బర్లు, శనగలు, మొలకల చాట్ లను తీసుకోవటం బెటర్. టీనేజ్ మొదలుకోని 30 ఏండ్ల వయసును లైఫ్ లో టర్నింగ్ పాయింట్ గా పేర్కొంటారు. చదువు, కెరియర్ వంటి హడావిడిలో పడి చాలామంది తగిన పోషకాహారం తీసుకోరు. మరికొందరు బరువు పెరిగిపోతామనే ఉద్దేశంతో ఆహారం తక్కువగా తింటుంటారు. అయితే ఈ పరిస్థితి మహిళల్లో రెగ్యులర్ పీరియడ్స్, రీ ప్రోడక్టివ్ హెల్త్ ఇష్యూస్ వంటి సమస్యలకు కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే 15 నుంచి 30 ఏండ్ల వయసులో పప్పు ధాన్యాలు, పండ్లు, నట్స్, సీ ఫుడ్, సోయా, తృణధాన్యాలు, లో ఫ్యాట్ కలిగిన ఆహారాలు, పచ్చని కూరగాయలు, బచ్చలి కూర, తోటకూర, బీన్స్, పౌల్ట్రీ, చాపలు వంటివి ఆహారంలో భాగంగా ఎక్కువగా తీసుకోవటం బెటర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: