సరిహద్దులే సరైనవి..! పర్సనల్ బౌండరీస్ అవసరమంటున్న నిపుణులు..!
మీ సమయం మీకు చాలా విలువైనది. కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకోవటం అనేది మీ పరిధిలో ఉండాలంటున్నారు నిపుణులు. అందుకోసం వర్క్ లో, ఇంటిలో, సామాజికంగా టైమ్ బౌండరీస్ ను సెట్ చేయటం చాలా ముఖ్యం. అలా సెట్ చేస్తున్నారంటే మీరు వాటి ప్రాధాన్యతను అర్థం చేసుకుంటున్నారని అర్థం. మీకు అనేక అంశాలు ప్రయారిటీ గా అనిపించవచ్చు. అన్నిటికీ అతిగా కట్టుబడి ఉండకుండా తగినంత సమయాన్ని మాత్రమే కేటాయించండి. మీ ప్రాధాన్యతలను మీరు అర్థం చేసుకున్నప్పుడు.
ఇతర వ్యక్తులకు ఇచ్చే సమయాన్ని పరిమితం చేయటం చాలా సులభం అవుతుంది. ఉదాహరణకు ఈ వారాంతంలో నేను ఆ ఈవెంట్ కి రాలేను, నేను ఒక గంట మాత్రమే ఉండగలను. అనేవి టైమ్ బౌండరీస్ గా పేర్కొనవచ్చు. మీరు సంతోషంగా ఉండాలంటే మీకంటూ ఫిజికల్ బౌండరీస్ కూడా ఉండాలి. అంటే మీ పర్సనల్ స్పేస్ ప్రయారిటీగా దీనిని పేర్కొనవచ్చు. టచ్ విషయంలో కంఫర్ట్ గా ఉండాలనుకోవటం, రెస్ట్ తీసుకోవటం, సమయానికి తినటం, నీరు తాగటం వంటివి శారీరక అవసరాలుగా ఉంటాయి. మిమ్మల్ని టచ్ చేయటం ఇష్టం లేదని లేదా నీకు స్పేస్ కావాలని ఇతరులకు తెలియజేయాలని అనిపించినప్పుడు తప్పక ఆ పని చేయాలి. అలాగే ఆకలితో ఉన్నప్పుడు, రెస్ట్ అవసరం అయినప్పుడు వాటిని వ్యక్తం చెయ్యటం తప్పు కాదనే భావన మీకు ఉండాలి.