ఎదుటి వ్యక్తిలో ఈ మార్పులు కనిపిస్తే... వారు సంతోషంగా లేరని అర్థం.!
వాటిని అర్థం చేసుకొని ఎమోషనల్ సపోర్ట్ అందిస్తే సాధారణంగా మారుతారు. అయితే సైకాలజీస్టుల ప్రకారం.. అలాంటి వ్యక్తుల మాటలు, చేతలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడూ నవ్వుతూ... సంతోషంగా కనిపించే వారందరూ నిజంగానే అలా ఉన్నారని గ్యారంటీగా చెప్పలేం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కొందరు తాము అనుభవిస్తున్న బాధలను, భావోద్వేగాలను ఎవరితోనూ వ్యక్తం చేయలేక ఇబ్బంది పడుతుంటారు. అయితే దీనిని కవర్ చేయడానికి హ్యాపీగా ఉన్నట్లు బిహేవ్ చేస్తుంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు హైపర్ యాక్టివ్ గా ప్రవర్తిస్తూ నిజమైన భావాలను దాచేస్తుంటారు. అలాగే ఎక్కువగా జోకులు వెయ్యటం, ఎవరైనా జోకులు వేసిన, ఏదైనా మాట్లాడిన దాని పట్ల ఎక్కువగా రెస్పాండ్ అవ్వటం, అతి చొరవ ప్రదర్శించడం చేస్తుంటారు.
కానీ వీరిని లోలోపల ఓ విధమైన అసంతృప్తి వెంటాడుతూ ఉండవచ్చు అంటున్నారు మానసిక నిపుణులు. లోలోన లోన్లీనెస్ భావాలు వెంటాడుతున్న వారు సరదాగా, నవ్వుతూ కనిపించినప్పటికీ, వారిలో కనిపించే మరో కోణం ఆయా సందర్భాల్లో నెగిటివ్ పదాలను ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. తమను తాము ప్రతికూల పదాలతో విమర్శించుకుంటారు. నాదేముంది? నేను అలా చేసిన లాభం లేదు. ఈ జీవితం నీటిపై బుడగలాంటిది ? ఏదో కొన్నాళ్ల జీవితంలో ఎలాగోలా బతికేయాలి, వంటి మాటలు ఉపయోగిస్తుంటారు. అయితే ఎప్పుడు వీటిని యూజ్ చెయ్యరు. దీంతో పాటు పలు విషయాల్లో తీవ్రమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు. బాధలు, సంబంధాలు, కుటుంబం వంటివి భారంగా భావిస్తారు. లైఫ్ లో హ్యాపీగా, లోన్లీగా ఉన్నట్లు భావించే వారు తమను తాము ఎక్కువగా విమర్శించుకుంటూ ఉంటారు.