శీతాకాలంలో ఒంట్లో చలిని తరిమేసే సూపర్ స్నాక్స్.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..!
చలికాలంలో సరైన ఆహారం తీసుకుంటే శరీరానికి సహజమైన తాజాదనాన్ని, శక్తిని అందిస్తాయి. అలాగే చలికాలంలో ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడతాయి. కాబట్టి ఈ కాలంలో ఏవో ఆహారాలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం. చలికాలంలో సీట్లను తినాలనిపించడం సర్వసాధారణం. దీనికోసం చక్కెరకు బదులుగా బెల్లం వాడితే మంచిది. బెల్లం తీపి రుచిని మాత్రమేకాకుండా, శరీరానికి మేలు చేసే ఐరన్, ఖనిజాలను కలిగి ఉంటుంది. శరీరానికి పోషకాలను అందించే ఖర్జూరం, అంజీర్ పండు, కొబ్బరి వంటి సహజ పదార్థాల ద్వారా స్వీట్లు తయారు చేసుకోవచ్చు. శాతం 70 కంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్ కూడా మంచి ఎంపీకే. తులసి, అల్లం, దాల్చిన చెక్క, చమోమిలే వంటి హెర్బల్ టీలు శరీరాన్ని వేడిగా ఉంచడమే కాకుండా జీర్ణ క్రియను కూడా మెరుగుపరుస్తాయి.
తులసి, అల్లంతో చేసిన టీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దాల్చిన చెక్క, చమోమిలే టి ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రను మెరుగు పరుస్తుంది. గొంతుకు ఉపశ్రమమం కలిగించడానికి, జలుబు, దగ్గు నివారించడానికి టీలో కొంచెం తేనె కలుపుకోవాలి. వాల్ నట్స్, జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష వంటి డ్రైఫ్రూట్స్ చలికాలంలో తింటే మంచిది. వీటిల్లో ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది శరీరానికి శక్తిని ఇవ్వటమే కాకుండా చర్మానికి తేమను, మెరుపును ఇస్తుంది. అంతేకాకుండా, డ్రై ఫ్రూట్స్ శరీరానికి వేడిని అందిస్తాయి. వీటి వినియోగం ముఖ్యంగా చలికాలంలో శరీరంలోని రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. చలికాలంలో వేడి సూప్ శరీరాన్ని పచ్చగా ఉంచుతుంది.