అన్నం లేదా చపాతీ.. ఇందులో ఏది తింటే బరువు తగ్గుతారు?
ఇందులో బరువు తగ్గటానికి డైట్ పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంటారు. బరువు తగ్గడానికే రాత్రిపూట తినటానికి ఉత్తమమైన ఆహారం అన్నం తినటం మంచిదా? లేదా రోటి తింటే మంచిదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ రెండు ఆహారాలపై ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు చూద్దాం. బియ్యంలో ప్రోటీన్లు, విటమిన్ బి, ప్లెక్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి. మీ శరీరం శక్తి స్థాయిని పెంచడంలో అన్నం చాలా సహాయపడుతుంది. అంతే కాకుండా ఇందులోని పోషకాలు మీ కండరాల పెరుగుదలకు తోడ్పడతాయి. ఇది కాకుండా బియ్యం కూడా గ్లూడెన్ ఫ్రి. అంతేకాకుండా మీకేం లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని సెల్ డామేజ్ కాకుండా కాపాడతాయి.
బరువు తగ్గాలనుకునే వారు రోటి లేదా బ్రౌన్ రైస్ తినాలి. రాత్రిపూట అన్నం తినటం వల్ల మీ పేగు ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే రాత్రిపూట రోటీ తినడం మంచిది. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, మీరు అన్నం తినకూడదు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్నం తక్కువగా తినాలి. దాని స్థానంలో అధిక ఫైబర్ ఉన్న తృణధాన్యాలు తీసుకోవాలి. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆహారం గురించి మీ వైద్యుల్ని సంప్రదించడం మంచిది. ఈ సమస్యలు ఉన్నవారు అన్నాన్ని తినకపోవడం మంచిది.