ఉసిరికాయలతో టేస్టీ కర్రీ... రుచి, ఆరోగ్యం కూడా..!
ప్రతిరోజు చిన్న ఉసిరిముక్క తిన్న ... ఎన్నో రోగాలు రాకుండా అడ్డుకుంటుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా గా ఉంటుంది. ఇది చర్మానికి, జుట్టు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఉసిరికాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ముందుగా పచ్చి ఉసిరికాయలను ఉడకబెట్టుకోవాలి. ముక్కలుగా కోసి ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత నీటిని వంచేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, సోంపు వేసి దోరగా వేయించి చల్లార్చుకోవాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఆ తరువాత కారం, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, విక్స్ పట్టిన పొడి వేసి అన్ని ఓ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక పక్కన పెట్టిన ఉసిరి మొక్కలు కూడా వేసి అన్ని చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి దింపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ కర్రీ సిద్ధం. వీటిల్లోవంకాయలు, బెండకాయలు, ములక్కాయ కూడా వేసి వండుకున్న చాలా రుచిగా ఉంటుంది.