ఒత్తిడిని తగ్గించే కాఫీ స్మూతీ.. ఇలా చిటికెలో చేసేయండి..!

lakhmi saranya
ఉదయం లేచిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా కాఫి తప్పకుండా తాగుతారు. ఒత్తిడిని తగ్గించుకోవడంలో కాఫీ ఎంతో చక్కగా పనిచేస్తుంది. కాఫీనే కాకుండా కాఫీ పౌడర్ తో చేసే ఈ స్మూతీ తాగితే బత్తిడి క్షణాల్లో తగ్గిపోతుంది. మీ మూడ్ స్వింగ్స్ కూడా మారిపోతుంది. ఒత్తిడి నుంచి ఈజీగా రిలీజ్ పొందవచ్చు. మరి ఈ కాఫీ స్మూతీ ఎలా తయారుచేస్తారు? ఈ కాపీ స్మూత్ కి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుత కాలంలో చాలామంది ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఈజీగా దీన్ని తగ్గించుకుంటే...
మరి కొంతమంది మాత్రం డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోతున్నారు. ఒత్తిడిని తగ్గించుకోకపోతే.. చిన్ను దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒత్తిడిని తగ్గించుకోవడంలో కాఫీ ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఒక గ్లాస్ కాఫీ స్మూతీ తయారు చేసుకోవటానికి మూడు స్పూన్ల ఓట్స్ కావాలి. కాబట్టి ఒక బౌల్ తీసుకుని అందులో మూడు స్పూన్ల ఓట్స్ తీసుకుని గోరువెచ్చటి నీళ్లు వేసి కనీసం రెండు గంటలసేపు అయినా నానబెట్టాలి. ఆ తరువాత నీరు బంపేసి.. మిక్స్ లేదా బ్లండర్ సహాయంతో ఓట్స్ని మెత్తని క్రీమ్ లా తయారు చేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ ఇన్సెడెంట్ కాఫీ పౌడర్ వేసి కలపాలి.
 ఇది కూడా అంతా కలిసేలా బ్లండ్ చేయాలి. ఆ తరువాత ఇందులో నానబెట్టిన జీడిపప్పు, ఖర్జూరం, కొద్దిగా పీనట్ బట్టర్ కూడా వేసి అంతా కలిసేలా మళ్లీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నానబెట్టిన చియా సీడ్స్, సన్నగా తరిగిన బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవాలి. బాదం కూడా నానబెట్టింది తీసుకోవాలి. ఇలా నేరుగా తాగేయవచ్చు. చల్లగా తాగాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. లేదంటే ఫ్రిజ్లో పెట్టుకుని తాగవచ్చు. ఈ స్మూతీ తాగటం వల్ల ఒత్తిడి, ఆందోళన అంతా పోతుంది. బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. ఈ స్మూతీ రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా బత్తిడిగా ఫీల్ అయినప్పుడు ఈ స్మూతీని ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: