వరల్డ్ ఫేమస్ వింటర్ ఫెస్టివల్స్... ఎక్కడ ఎలా జరుపుకుంటారంటే..!
ఉత్సాహం నింపే పరేడ్స్, మీరుమిట్లు గొలిపే లేట్లు, మంచు గడ్డలపై నడకలు వంటి ఆటలు, సాంప్రదాయ పద్ధతులు కూడా చూడవచ్చు. అలాగే శీతాకాలం ప్రయాణం చేయడానికి సరైన, అలాగే అనువైన సమయం గాను పేర్కొంటారు. అయితే వరల్డ్ వైల్డ్ గా ఈ కాలంలో జరుపుకునే ముఖ్యమైన పండగలు ఏవో చూద్దాం. మిన్నెసోటా లో జరిగే అత్యంత ముఖ్యమైన శీతాకాలపు పండగల్లో సెయింట్ పాల్ వింటర్ కార్నికాల్ ఒకటి. ఇది 2025 జనవరి 23 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరుగుతుంది. ఈ ఐకానిక్ ఫెస్టివల్ మంచు, మంచు పై పరేడ్ పోటీలు, వివిధ కార్యకలాపాలతో వింటర్ను సెలెబ్రేట్ చేసుకుంటుంది.
అనేక రకాల శీతాకాలపు క్రీడలు, స్థానిక సంస్కృతిని, రుచికరమైన ఆహారపు అలవాట్లను ఆస్వాదించడానికి ఈ వింటర్ కార్నివాల్ ఫెస్టివల్ ప్రసిద్ధి చెందిన వేదికగా పేర్కొంటారు. సపోరో స్నో ఫెస్టివల్ అయినా సపోరో ను మంచుతో నిండిన వండర్ ల్యాండ్ గా మారుస్తుంది. 1950 లో కేవలం ఆరు శిల్పాల తో ప్రారంభించిన ఈ పండుగ ప్రపంచ పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సంవత్సరం ఇది ఫిబ్రవరి 4 నుంచి 2025 ఫిబ్రవరి 11 వరకు జరుగుతుంది. సందర్శకులు మంచు శిల్పాలపై తిరగాడే పోటీలు, ప్రత్యక్ష ప్రదర్శనలు, ఫుడ్ స్టాల్స్ ఇక్కడ చూడ ముచ్చటగా ఉంటాయి. అద్భుతమైన మంచు, ప్రకృతి దృశ్యాలలో జపానీస్ కళాత్మకత క్రియేటివిటీని ప్రదర్శిస్తుంది.