రాత్రి పడుకునే ముందు ఇది రాస్తే ఉదయానికి ఫేషియల్ లుక్..!
ఖరీదైన క్రీములు కూడా వాడుతూ ఉంటారు. బ్యూటీ పార్లర్ స్కూల్ వెళ్లి డబ్బులు ఎక్కువగా పెట్టి మరీ ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో ఉండే వాటితోనే మనం ఎంతో అందంగా తయారవ్వవచ్చు. తక్కువ ఖర్చుతోనే అందంగా మెరిసిపోవచ్చు. ఈ విషయం తెలియక చాలామంది డబ్బును వృధాగా ఖర్చు చేస్తున్నారు. ఇంట్లోనే కాస్త సమయం ఇస్తే ఫేషియల్ లుక్ మన సొంతం అవుతుంది. రాత్రి పడుకునే ముందు ఇవి రాసి పడుకుంటే ఉదయం వరకు మీ ముఖం మెరిసిపోతుంది. చర్మ సమస్యలను దూరం చేసి.. ముఖ సౌందర్యాన్ని పెంచడంలో బాదం ఆయిల్ కూడా ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు బాదం నూనె ముఖానికి రాసి పడుకుంటే..
గ్లోతో పాటు చర్మ రంగు కూడా మెరుగు పడుతుంది. పచ్చిపాలలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. పచ్చి పాలల్లో మనకు లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని క్లీన్ చేయడంలో ఎంతో చక్కగా సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు పచ్చి పాలలో కాటన్ ముంచి ముఖంపై అంతా అప్లై చేసుకుని పడుకోవాలి. ఒక గంట సేపు ఉంచి అయినా కడిగేసుకోవచ్చు. ఇలా తరచూ చేస్తే మీ ముఖంలో వచ్చే గ్లోని చూసి మీరే షాక్ అవుతారు. కలబంద కూడా స్కిన్ సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు.. చర్మానికి తేమను అందించి.. కాంతివంతం చేస్తుంది. కొద్దిగా కలబంద రాత్రిపూట ముఖానికి రాసి అరగంటసేపు తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఇలా చేస్తే.. మరి రిజల్ట్ ఉంటుంది.