మీకూ కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలా? అయితే బియ్యం నీళ్లతో ఇలా చేసి చూడండి..!
ఈ నీటిలో ఫెరులిక్ యాసిడ్, అల్లాంటోయిన్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ నీటిని ఉపయోగించడం వల్ల చర్మం సైతం మెరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. చర్మవ్యాధి, మొటిమలు వంటి చర్మ సంబంధిత సమస్యలను నయం చేయడంలో బియ్యం కడిగిన నీరు సహాయపడుతుంది. ఇది చర్మంపై నల్ల మచ్చలు, మంట, వాపును నయం చేయటంలో సహాయపడుతుంది. అంతేకాకుండా బియ్యం నీటిలో విటమిన్లు, అమైనో ఆమ్లాలు, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి చర్మంపై రంద్రాలను తగ్గించడంలో సహాయపడుతాయి. ఇది కులాజైన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
దీంతో ముఖం మెరుస్తుంది. మీ ముఖంపై మొటిమలు ఉంటే, ప్రతిరోజు ఈ నీటితో ముఖం కడగవచ్చు. ఈ నీళ్లతో ముఖం కడుక్కున్నాక చర్మం తేమగా, మృదువుగా మారుతుంది. ఇది సహజ టోనర్‌గా పనిచేసి PH స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది. దీంతో ముఖం మెరుస్తుంది. ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. అందువల్ల ఇది అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో, యవ్వనాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది. ఈ నీటిని ముఖానికి పట్టించడం వల్ల చర్మంపై ముడతలు సైతం తగ్గుతాయి. ఇది చర్మానికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా పోషణ ను అందిస్తుంది.