నీ పాదాలు, చేతులు మాటి మాటికి చల్లబడుతున్నాయా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..!

lakhmi saranya
సాధారణంగా వాతావరణం చల్లగా ఉంటే కాళ్లు, చేతులు, పాదాలు చల్లబడటం కామన్. ఇలా ఎప్పుడో ఒక్కసారి జరుగుతుంది. కానీ కొందరికి ఎల్లవేళలా ఇలా పాదాలు, చేతులు చల్లగానే ఉంటాయి. ఇది అనారోగ్య సంకేతం. మీలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. చల్లని గాలి ఒంటికి తాకితే ఒక్కసారిగా చేతులు, కాళ్లలో రక్త ప్రసన్న తగ్గిపోతుంది. అనంతరం కాసేపటికే ఒళ్ళు మళ్లీ వేడెక్కుతోంది.
ఇలా చల్లని వాతావరణం లో శరీర భాగాలు వేడేక్కుతున్నాయి అంటే అది మంచి ఆరోగ్యం అని అర్థం. అంటే శరీరంలో రక్తప్రసన్న సవ్యంగా సాగుతుందని అర్థం. కానీ చేతులు, కాళ్లు విపరీతంగా చల్లగా ఉండి, మంచులా చల్లగా మారిపోతే శరీరంలో పలు పోషకాల నిర్దిష్ట లోపానికి సంకేతం అని అర్థం. అసలు చేతులు, కాళ్లు ఎందుకు చల్లగా మారతాయో ఇక్కడ చూద్దాం. చేతులు, కాళ్లు చల్లగా మారటం వెనుక ఉన్న అతిపెద్ద కారణాల్లో ఒకటి వారి రక్తా ప్రసన్న సరిగ్గా లేకపోవటం. ఇది రక్త ప్రసన్నను తగ్గిస్తుంది. దీని కారణంగా, శరీర ఉష్ణోగ్రత తగ్గటం ప్రారంభం అవుతుంది.
చల్లటి పాదాలకు మరో ప్రధాన కారణం రక్తప్రసరణ ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవటం. దీనివల్ల రక్త ప్రసన్న తగ్గి పాదాలు చల్లగా మారతాయి. అంతేకాకుండా, కాళ్లు, చేతులు ఎల్లప్పుడూ చల్లగా మారితే కొన్ని రకాల వ్యాధులు దాడి చేస్తాయి. శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గుముఖం పట్టిన పాదాలు చల్లగా మారతాయి. రక్తహీనతతో బాధపడుతున్న రోగి శరీరంలో రక్తం లేకపోవటంతో బాధపడుతున్నాడు. దీని కారణంగా పాదాలు చల్లబడటం ప్రారంభిస్తాయి. అలాగే B12, ఫోలేట్, ఐరన్ లోపం కారణంగా కూడా పాదాలు చల్లగా మారతాయి. దీర్ఘకాలిక మూత్రపిండా వ్యాధి కారణంగా కూడా పాదాలు చల్లబడతాయి. అంటే శరీరంలో రక్తప్రసన్న సవ్యంగా సాగుతుందని అర్థం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: