సోషల్ మీడియాలో ఓవర్ షేరింగ్... మోసపోతారు జాగ్రత్త!
ఇలా ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేవారు ' సైబర్ స్టాకింగ్' బారిన పడి మోసపోయే అవకాశాలు ఎక్కువ అని చెబుతున్నారు. ఈ ఓవర్ షేరింగ్ తో సైబర్ స్టాకర్లు మీ సమాచారాన్ని హ్యాక్ చేయడానికి, ఫేక్ ప్రోఫైల్స్ క్రియేట్ చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి, మోసం చేయడానికి అవకాశం ఎక్కువ. కాబట్టి పర్సనల్ విషయాలను పంచుకోకూడదు అంటున్నారు నిపుణులు. ఇంకా ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయో చూద్దాం. సామాజిక మధ్యమాల్లో ఫేమస్ అవ్వాలని మీ కోరికను సైబర్ నేరగాళ్లు అవకాశం గా మల్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు. మీరు తరచుగా ఫేస్ చేసే వీడియోలు, ఫోటోలు,
వాటికి వచ్చే లైకులు, షేరింగ్లు వంటివి ట్రాక్ చేస్తూ మోసం చేసేందుకు సైబర్ స్టాకర్లు రెడీగా ఉంటారు. మీ మాటలు, షేరింగ్ లను బట్టి మీ ఆర్థిక పరిస్థితిని కూడా అంచనా వేస్తారు. ఫేక్ ఎకౌంట్, బ్యాలెన్స్ వంటి అంశాలను తెలివిగా రాబడతారు. స్నేహితులుగా పరిచయమై చాటింగ్ చేస్తూ... మీ వ్యక్తిగత వివరాలను రికార్డ్ చేస్తారు. మీరు అమాయకులని భావిస్తే బెదిరింపులు లేదా బ్లాక్ మెయిలింగ్ క కూడా పాల్పడతారు. చెప్పింది వినకపోతే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను వైరల్ చేస్తామని డబయిస్తారు. ఇలాంటి అప్పుడే కొందరు భయాందోళనలకు లోనవుతారు. ఇలా సైబర్ మెసగాళ్ల భార్యనా పడి సూసైడ్ చేసుకున్న వారు కూడా లేకపోలేదు.