కంటి చూపు పార్ప్ అవ్వాలంటే... ఈ ఫుడ్స్ తప్పనిసరి..!
ప్రస్తుత కాలంలో చాలామంది కంటికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్యకాలంలో స్క్రీనింగ్ టైమ్ కూడా చాలా పెరిగిపోయింది. స్క్రనింగ్ వల్ల కంటిపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. కాబట్టి స్క్రినింగ్ టైమ్ ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అదే విధంగా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. కంటి చూపు మెరుగుపడాలంటే చిన్నప్పటి నుంచి క్యారెట్స్ తినాలని చెబుతూనే ఉంటారు. మంచి ఫ్రెష్ ఫుడ్స్ తినడం వల్ల కూడా కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
ఆరెంజెస్ లో ఎక్కువ శాతం విటమిన్ సి ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. చాపలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో ఉండే విటమిన్ ఏ, ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్ కంటి సమస్యలను రాకుండా చేస్తుంది. గుడ్డు కూడా కళ్ళను ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి. అందుకే ప్రతిరోజు ఒక గుడ్డు తినాలని చెబుతూ ఉంటారు. బీట్ రూట్ తినటం ఆరోగ్యానికే కాకుండా కళ్ళకు కూడా చాలా మంచిది. ఇందులో ఉండే బీట్ కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆకుకూరల్లో కూడా విటమిన్ ఏ లభిస్తుంది. కాబట్టి తరచూ ఆకుకూరలు తినటం మంచిది. కళ్ళు ఆరోగ్యంగా పనిచేస్తేనే ఏ పని అయినా చెయ్యగలం. కాబట్టి స్క్రినింగ్ టైమ్ ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అదే విధంగా మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. శరీరంలో అతి ముఖ్యమైన శరీర భాగాల్లో కళ్లు ఎంతో ముఖ్యం.