ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఎక్సెర్ సైజ్ చేయటం మంచిదేనా?
కొందరు జిమ్ కి పరిగెడుతుంటారు. త్తారు చాలామంది రెగ్యులర్గా వర్క్ అవుట్ చేస్తుంటారు. పొద్దున్నే వర్క్ వుట్ చేస్తే బరువు కూడా వేగంగా పడుతుంది. నిజానికి రాత్రిపూట నిద్రపోయిన తర్వాత, శరీరంలో గ్లైకోజెన్ తగ్గుతుంది. ఫలితంగా, ఉదయాన్నే మేల్కొన్నప్పుడు గ్లైకోజెన్ కు బదులుగా, కొవ్వు వేగంగా ప్రవహిస్తుంది. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో వర్కౌట్ చెయ్యాలా వద్దా అని సందేహం చాలా మందికి కలుగుతుంది. చాలామంది కాలు కడుపుతో పనిచేయటం సుఖంగా ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం ఇలా చేయడం వల్ల ఇబ్బందుల్లో పడతారు. నిజానికి కాళీ కడుపుతో వ్యాయామం చేయటం మంచిది కాదు.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును త్వరగా తగ్గించుకోవటం మంచిదే. కానీ ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే , గ్లైకోజెన్ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం బలహీనంగా మారేలా చేస్తుంది. అలాంటప్పుడు వ్యాయామం చేయటం కష్టంగా మారుతుంది. కాబట్టి ఉదయాన్నే కాస్త తక్కువగా తిని, వ్యాయామం చేయటం వల్ల ప్రయోజనం పొందవచ్చు. అయితే ఇప్పుడు వచ్చే మరో ప్రశ్న.. ఉదయాన్నే ఏం తినాలి? వ్యాయామానికి ముందు అరటిపండు తినవచ్చు. అరటిపండు తినటం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. ఇందులో ఉండే పిండి పదార్థాలు, పొటాషియం కండరాలు, నరాలను చురుగ్గా ఉంచుతాయి. అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఈ కింద తెలుసుకోవచ్చు.