ఈ కూరగాయలకు తొక్క తీయకుండా తింటేనే ఆరోగ్యమట...!
అయితే కొన్ని రకాల కూరగాయల్ని ఎలా తినాలో చాలామందికి తెలియదు. కొన్నిటికి తొక్క తీసి.. మరికొన్నిటిని నేరుగా వండి తింటూ ఉంటారు. కానీ కొన్ని రకాల కూరగాయల్ని మాత్రం తొక్కతో తింటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలా తింటేనే పోషకాలు అందుతాయని అంటున్నారు. మరి ఆ కూరగాయలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. చాలామంది ఆలు గడ్డలకు తొక్క తీసి వండి తింటూ ఉంటారు. అలా తింటేనే మంచిది అనుకుంటారు. నిజానికి బంగాళదుంప తొక్కలో కూడా పోషకాలు ఉంటాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. తొక్కతో తింటే ఎర్ర రక్త కణాల పనితీరును మెరుగ్గా పరుస్తుంది. జీర్ణ వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది. కాబట్టి శుభ్రంగా కడిగి తొక్కతో తినేందుకు ట్రై చేయండి. తొక్కతోపాటు కలిపి తినాల్సిన కూరగాయల్లో బీరకాయలు కూడా ఒకటి.
వీటిని కూడా తొక్కతో తింటేనే మరిన్ని పోషకాలు అందుతాయి. బీరకాయ తొక్కలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ సి, పొటాషియం వంటివి కూడా లభిస్తాయి. పొట్టుతో తినే జీర్ణ వ్యవస్థ, ఎముకలు, గుండె ఆరోగ్యం, ఒత్తిడి కంట్రోల్ అవుతాయి. క్యారెట్ లను కూడా తొక్కతో పాటు తింటేనే ఆరోగ్యం. పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేస్తే.. పైన ఉండే మురికి పోతుంది. తొక్క తీయకుండానే క్యారెట్ తినాలి. మందులు వాడుతూ ఉంటారని పైన తొక్క తీసేస్తారు. కానీ దీనివల్ల పోషకాలు తగ్గుతాయి. చాలామంది వంకాయకు కూడా స్కిన్ తీసేస్తూ ఉంటారు. ఉప్పు వేసిన నీటితో శుభ్రంగా క్లీన్ చేస్తే.. తొక్క తీయాల్సిన పని ఉండదు. ఆయన తొక్కతోపాటు తింటేనే ఆరోగ్యానికి మేలు. పైన లెయర్ లోనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అనేక పనులను నిర్వహిస్తుంది.