కొబ్బరి చిప్పను పారేసే బదులు ఇలా చేస్తే బోలెడు ఉపయోగాలు!
ఈ కొబ్బరి చిప్ప బొగ్గు పొడి చర్మం, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగించవచ్చు. కొబ్బరి చిప్ప బొగ్గు పొడిని ఇలా వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని చెబుతున్నారు. మార్కెట్లో లభించే షాంపుని వాడే వారు ఎక్కువ. కెమికల్ షాంపు ని ఉపయోగించకుండా కొబ్బరి చిప్పల బూడిదను షాంపూగా ఉపయోగించవచ్చు. మీరు ఉపయోగించే షాంపులో కొబ్బరి చిప్పల బూడిద వేసి బాగా కలపాలి. దీన్ని షాంపూ గా ఉపయోగించడం వల్ల జుట్టు శుభ్రపడటమే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది స్కాల్ప్ ను శుభ్రపరిచే ఉత్తమ స్క్రబ్.
రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి చెప్పాలా బూడిదను కొబ్బరి నూనెతో కలపండి. ఈ మిశ్రమంతో స్కాల్ప్ ను సున్నితంగా స్క్రబ్ చేయండి. ఇలా చేయటం వల్ల జుట్టులోనే మలినాలు తొలగిపోతాయి. స్కాల్ప్ నుండి అదనపు నూనెను గ్రహించడంలో సహాయపడుతుంది. కొబ్బరి చెప్పల బూడిదతో హెయిర్ మాస్క్ తయారు చేసి జుట్టుకు అప్లై చేయడం చాలా ప్రభావమంతంగా ఉంటుంది. ఒక కప్పు నీటిలో అర చెంచా బేకింగ్ సోడా, అరే చెంచా కొబ్బరి చిప్పల బూడిద కలపాలి. ఈ విశ్రమాన్ని తలకు పట్టించి మృదువుగా మసాజ్ చేసి కాసేపు అలాగే ముంచి తలస్నానం చేయాలి. ఈ నేచురల్ హెయిర్ మాస్క్ దెబ్బతిన్న జుట్టును రిపేర్ చేస్తుంది. చుండ్రు మరియు జుట్టు రాలటం సమస్య నుండి ఉపశమనం పొంది ఆరోగ్యమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.