' గేమ్ ఛేంజర్' కు సపోర్ట్ గా తెలుగు హీరోలు!

lakhmi saranya
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయినా సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే అన్ని భాషల్లో బుకింగ్స్ ఓపెన్ అవ్వగా... హాట్ కేకుల్లా ఫ్యాన్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత రామ్ చరణ్ స్ట్రైట్ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ కు మద్దతుగా ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు.
 ఈరోజు సాయిధర్మతేజ్, ఆది సాయికుమార్, డాక్టర్ మలినేని గోపీచంద్ వంటి వారు బెస్ట్ విషెస్ చెబుతూ ట్వీట్స్ పెడుతున్నారు. తమిళ అగ్ర దర్శకుడు శంకర్ తలకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్లుగా కియారా అద్వానీ, అంజలి నటించారు. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్న సంగతి అందరికీ తెలుసు. శ్రీకాంత్, ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించారు. తదితరులు ఈ కొన్ని పాత్రల్లో నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి స్టూడియోస్,
దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మించారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందో లేదో తప్పకుండా చూడాలి. ఇంత బడ్జెట్ పెట్టినా సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. రామ్ చరణ్ సినిమా ఈ మధ్యకాలంలో రాలేదు కాబట్టి ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారు. మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. గేమ్ ఛేంజర్ సినిమా ఈరోజు తెల్లారు జామున రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ షో కి చాలామంది వచ్చారు. కోట్లలో వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తప్పకుండా విజయాన్ని అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: