మతిమరుపుతో బాధిస్తున్నారా?.. ఈ 8 పనులు అలవాటు చేసుకోండి?.!
విటమిన్ B12, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు – బాదం, వాల్‌నట్, చేపలు, అవిసె గింజలు, మెంతులు.ఆకుకూరలు మెదడుకు మేలు చేస్తాయి. పండ్లు – జామ, ద్రాక్ష, అరటి, ఆపిల్, మెదడు ఆరోగ్యానికి మంచివి. శరీరంలో డీహైడ్రేషన్ ఉంటే మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగడం అవసరం. నిద్ర సరైన విధంగా తీసుకోండి. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. సరైన నిద్ర లేకపోతే మెదడు చురుకుగా ఉండదు, మతిమరుపు పెరిగే అవకాశం ఉంటుంది. వాకింగ్ & వ్యాయామం చేయండి. నిత్యం 30-40 నిమిషాలు వాకింగ్, జాగింగ్ లేదా యోగా చేయడం మెదడు క్రియాశీలతను పెంచుతుంది. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి, మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. మద్యం & పొగ తాగే అలవాటు మానేయండి.
మద్యం, పొగ తాగడం మెదడు పనితీరును దెబ్బతీసి మతిమరుపును పెంచుతుంది. దీన్ని తగ్గిస్తే మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది. ఎక్కువగా చదవండి & రాయండి. రోజూ కొత్త విషయాలు చదవడం, డైరీ రాయడం మెదడును ఉత్తేజితం చేస్తాయి. కథలు, వార్తలు, పుస్తకాలు చదవడం జ్ఞాపకశక్తిని పెంచుతుంది. కొత్త భాష, కొత్త హాబీ నేర్చుకోవడం మెదడును యాక్టివ్‌గా ఉంచుతుంది.శరీరానికి అవసరమైన విటమిన్లు పొందండి. మెదడుకు అవసరమైన విటమిన్ B12, విటమిన్ D, ఐరన్ స్థాయులు సరిపోతున్నాయా అని పరీక్షించుకోండి. తక్కువగా ఉంటే ఆహారం లేదా సప్లిమెంట్స్ ద్వారా పొందాలి. జీలకర్ర లేదా బ్రాహ్మి కషాయం తాగండి.