
సమ్మర్ లో కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?.. అయితే తస్మాత్ జాగ్రత్త..!
కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తంలో సోడియం స్థాయులు తగ్గే ప్రమాదం ఉంది.ఇది సైరనెస్, బలహీనత, తలనొప్పి, వాంతులు వంటి సమస్యలను కలిగించవచ్చు.బ్లడ్ ప్రెజర్ తగ్గే ప్రమాదం. ఇది నేచురల్ బిపి రెగ్యులేటర్ అయినా, ఎక్కువ తాగితే బిపి అధికంగా తగ్గిపోవచ్చు.ముఖ్యంగా తక్కువ బిపి ఉన్నవారు జాగ్రత్తగా తాగాలి. షుగర్ లెవెల్స్ పెరగొచ్చు. కొబ్బరి నీటిలో నేచురల్ షుగర్స్ ఉంటాయి.షుగర్ ఉన్నవారు ఎక్కువ తాగితే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది.కొబ్బరి నీటిని ఎక్కువ తాగితే అజీర్ణం, మలబద్ధకం లేదా లూజ్ మోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు & కిడ్నీ రోగులు జాగ్రత్తగా తాగాలి.
కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉండటంతో, కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువ తాగకూడదు.గర్భిణీ స్త్రీలు మితంగా మాత్రమే తాగాలి, ఎందుకంటే ఇది కొన్ని సందర్భాల్లో బిపి తగ్గించగలదు. రోజుకు 1-2 గ్లాసుల కంటే ఎక్కువ తాగకూడదు. ఖాళీ కడుపుతో తాగితే మంచిది, కానీ ఓవర్లోడ్ అవ్వకూడదు. షుగర్ ఉన్నవారు, బిపి లేదా కిడ్నీ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి. అసలు తాగకూడదనేది కాదు, మితంగా తాగాలి. కొబ్బరి నీరు మంచిదే కానీ, అవసరానికి మించి తాగితే సమస్యలు కలిగించవచ్చు. రోజుకు 1 గ్లాస్ - 2 గ్లాసుల మించి తాగకూడదు. మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిది.