మనీ ప్లాంట్ ఇంటి బయట పెంచుతున్నారా..? పొరపాటున కూడా ఈ తప్పు చేస్తే మొత్తం మటాష్..!

Thota Jaya Madhuri
చాలామంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ ను పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.  మనీ ప్లాంట్ ఇంట్లో బాగా పెరిగితే ఆ ఇంట్లో డబ్బుకి కొదవ ఉండదు అని .. లక్ష్మీదేవి ఎప్పుడు తాండవం చేస్తూ ఉంటుంది అని చాలామంది జనాలు భావిస్తూ ఉంటారు . మరి కొంతమంది మనీ ప్లాంట్ ఆనందం - శ్రేయస్సు - సంపద కి చిహ్నంగా పరిగణించబడుతుంది . కనుక మనీ ప్లాంట్ ను ఇళ్లలో పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . కొంతమంది నేచర్ ని ఇష్టపడే వాళ్ళు మనీ ప్లాంట్ ని ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు.  అయితే ఇంట్లో ఎక్కడపడితే అక్కడ మనీ ప్లాంట్ ఉండడం వల్ల ప్రతికూలతను పెంచుతుంది అంటున్నారు వాస్తు శాస్త్ర పండితులు.



వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి బయట మనీ ప్లాంట్ నాటడం వల్ల దాని ప్రయోజనాలు కన్నా ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయట . మరీ ముఖ్యంగా మనీ ప్లాంట్ ను ఇంటి ఆగ్నేయ దిశలో పెంచుకోవాలట . ఇది చాలా చాలా మంచిగా శుభప్రదంగా పరిగణించబడుతుందట.  ఆగ్నేయాని గణేష్ ని పాలిస్తాడు కాబట్టి ఇది చాలా మంచిది అంటున్నారు వాస్తు శాస్త్ర పండితులు.  ఈ దశలో మనీ ప్లాంట్ ను ఉంచడం వల్ల గణేష్ గణపతి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందట . అయితే కొంతమంది పురుగులు బల్లులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అని మనీ ప్లాంట్ ని ఇంటి బయట పెంచడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు .



వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఇంటి లోపల పెంచడమే సంపదను ఆకర్షిస్తుంది . మనీ ప్లాంట్ ని బయట పెంచితే ఇంటి నుండి డబ్బు బయటకు వెళ్ళిపోతుంది అంటున్నారు వాస్తు శాస్త్ర పండితులు . దీనివల్ల ఆర్థిక నష్టం కూడా రావచ్చట . అంతేకాదు మనీ ప్లాంట్ ఇంటి లోపల బాగా పెరుగుతాయి.  ఈ మొక్కకు ఎక్కువగా సూర్యరశ్మి అవసరం లేదు . ఇంటి బయట ఉంచినప్పుడు అది పెరగకపోవచ్చు . తద్వారా మనీ ప్లాంట్ ను చెడు శకునంగా కూడా పరిగణిస్తారు . ఆర్థిక కొరత కి కూడా దారితీస్తుంది అంటున్నారు వాస్తు శాస్త్ర పండితులు .



ఇంటి బయట బహిరంగ ప్రదేశాలలో మనీ ప్లాంట్ పెంచినప్పుడు ప్రతికూల శక్తి దుమ్ము ధూళి గ్రహిస్తుంది.  దీని కారణంగా సానుకూల శక్తిని కోల్పోతుంది అంటున్నారు వాస్తు శాస్త్ర పండితులు . మనీ ప్లాంట్ ఎప్పుడు కూడా ఫ్రెష్ గా కలకలాడుతూనే ఉండాలట.  ఆకులు ఎండిపోయినట్లు అలా ఉంటే అది దురదృష్టానికి సంకేతం అంటున్నారు .  ఒకవేళ మనీ ప్లాంట్ ఎన్నిసార్లు వేసిన అక్కడి సరిగ్గా చెట్టు రాకపోతే వాస్తు శాస్త్రం ప్రకారం అది నెగటివ్ ఎనర్జీ అంటున్నారు పండితులు.  కుటుంబ సంబంధాలలో ఉద్రిక్త.. విభేదాలు ..ఏర్పడతాయట. మనీ ప్లాంట్ ను పెంచడమే కాదు ఏ దిశలో పెంచాలి..? ఎలా పెంచాలి..? అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు వాస్తు శాస్త్ర పండితులు.  సరైన పద్ధతిలో కాకుండా ఎలా పడితే అలా పెంచితే అది ఇంట్లో ఆనందం శాంతి కోల్పోయేలా చేస్తుందట..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: