ఈ అలవాట్లతో షుగర్ కు శాశ్వతంగా చెక్ పెట్టే అవకాశం.. పాటించాల్సిన చిట్కాలు ఇవే!

Reddy P Rajasekhar
జీవనశైలిలో మార్పులు, కొన్ని అలవాట్లను పాటిస్తే షుగర్ వ్యాధిని నియంత్రించడం సులభమవుతుంది. కొన్ని ముఖ్యమైన అలవాట్లు పాటించడం ద్వారా ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. రోజుకు కనీసం 30-45 నిమిషాల పాటు నడవడం, జాగింగ్ చేయడం, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది.

 చక్కెర, మైదా, జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండాలి. బదులుగా, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు (మిల్లెట్స్), నట్స్, పప్పులు వంటివి తీసుకోవడం మంచిది. భోజనాన్ని ఒకేసారి ఎక్కువ కాకుండా చిన్న చిన్న భాగాలుగా ఎక్కువసార్లు తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. అలాగే, కిడ్నీలు సరిగ్గా పనిచేస్తాయి.

ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర తప్పనిసరి. సరిపడా నిద్ర లేకపోతే కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇది కూడా చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.

ఈ అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా షుగర్ వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. వైద్యుల సలహాలు కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. షుగర్ ట్యాబ్లేట్లు వాడుతూ ఈ టిప్స్ పాటిస్తే మంచిదని చెప్పవచ్చు.  దీర్ఘకాలిక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య శాశ్వతంగా దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: