ముఖంపై మొటిమల సమస్యతో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే ఆ సమస్య దూరం!

Reddy P Rajasekhar
ప్రపంచంలో అత్యధికుల్ని వేధించే సమస్యల్లో మొటిమలు ఒకటి. కౌమార దశ నుంచి యుక్త వయస్సు వరకూ చాలామందికి ఇవి ఇబ్బంది కలిగిస్తాయి. నిజానికి మొటిమలనేవి హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తాయి. అయితే జీవనశైలి మార్పులు, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటికి చెక్ పెట్టవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

మనం  తీసుకునే ఆహారం మొటిమల సమస్యపై ప్రభావం చూపుతుంది. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాలి. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.మొటిమలు రాకుండా ఉండాలంటే ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రోజుకు రెండుసార్లు మంచి ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కోవాలి. మేకప్ వేసుకున్నప్పుడు రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా తొలగించాలి.

చాలామందికి ముఖాన్ని తరచూ తాకే అలవాటు ఉంటుంది. దీనివల్ల చేతులకు ఉండే బ్యాక్టీరియా ముఖానికి చేరి మొటిమలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఫలితంగా మొటిమలు వస్తాయి. యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు

శరీరానికి సరిపడినంత నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. దీనివల్ల మొటిమలు తగ్గి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సూర్యరశ్మిలో ఎక్కువగా ఉండడం వల్ల కూడా చర్మం డ్యామేజ్ అవుతుంది. దానివల్ల మొటిమలు రావచ్చు. బయటికి వెళ్ళినప్పుడు కచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నా కూడా మొటిమలు తగ్గకపోతే చర్మ వైద్యుడిని సంప్రదించడం మంచిది. వారు మీకు సరిపోయే చికిత్సను సూచిస్తారు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: