సన్నగా ఉన్నారని చింతిస్తున్నారా?.. అయితే వీటిని తినండి..!

lakhmi saranya
కొంతమంది అధిక బరువుతో చింతిస్తుంటే మరీ కొంతమంది బరువు పెరిగేందుకు కృషి చేస్తున్నారు .  చాలామంది బరువు పెరగడం ఏముంది చాలా ఈజీ అనుకుంటారు . బరువు తగ్గడమే కష్టం కదా అని భావిస్తూ ఉంటారు . నిజానికి రెండు సమానమే . బరువు తగ్గడానికి ఎంతైతే కృషి చేయాలో బరువు పెరగడానికి కూడా అదే విధంగా కృషి చేయాలి . సహజ సిద్ధంగా బరువు పెరగవచ్చు . అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం . పాలల్లో ప్రోటీన్ మరియు క్యాల్షియం ఎక్కువగా ఉంటాయని మనందరికీ తెలిసిందే . ఇవి ఎముకలను బలంగా ఉంచడంలో దామోదపడతాయి . అదేవిధంగా బరువు పెరిగేందుకు కూడా సహాయపడతాయి .

అందువల్లనే భోజనం చేసినా అనంతరం పాలు తాగడం అలవాటు చేసుకోవడం వలన బరువు పెరగవచ్చు . ఇంట్లో సహజ సిద్ధంగా తయారు చేసిన మిల్క్ షేక్ తాగడం ద్వారా కూడా అధిక పోషకాలు హాంది బరువు పెరుగుతారు . దానికోసం ఒక అరటిపండు మరియు చాక్లెట్ అదే విధంగా ఒక స్పూన్ పీనట్ బట్టర్ లేదా ఏదైనా నెట్ బటర్ కలిపి తయారు చేసుకోవచ్చు . ఇక మరొక పదార్థం దుంపలు . బంగాళదుంప మరియు చిలకడదుంపలలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి . ఇవి బాడీకి ఎక్కువగా క్యాలరీలు అందిస్తాయి . అందుకే వీటిని మీ డైట్ లో చేర్చుకోవచ్చు . మొక్కలు ఆధారిత ప్రొటీన్ ఎక్కువగా లభించే నట్ బటర్ తీసుకోవడం వల్ల బరువు ఈజీగా పెరుగుతారు . ఇక బరువు పెరిగేందుకు కోడిగుడ్డు కూడా సహాయపడుతుంది .

కోడిగుడ్డులో ఉండే ప్రోటీన్ ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు అందిస్తుంది . ఇవి కండరాల పెరుగుదలకు దాహోదపడతాయి . ఇక నాట్ తినడం వల్ల కూడా బరువు ఈజీగా పెరగవచ్చు . బాదం మరియు వాల్నట్స్ అదేవిధంగా పిస్తా , డ్రై కివి వంటి వాటిలో క్యాలరీలు మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి . ఇవి బరువు పెరిగేందుకు సహాయపడతాయి . మార్కెట్లో ఎక్కువ ధర ఉండే అవకాడో లో హెల్తీ ఫ్యాట్స్ మరియు క్యాలరీలు అధికంగా ఉంటాయి . ఇక ఇది తినడం వల్ల కూడా మీరు బరువు గైన్ అవ్వవచ్చు . మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సహజ పద్ధతి అయినా ఆహారాలను మీ డైలీ రొటీన్ లో చేర్చుకొని మీ బాడీని పెంచుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: