పుదీనా ఆకుల వాడకం వలన ప్రయోజనాలు !

Seetha Sailaja
మన పరిసరాలలో దొరుకుతూ ఎంతో విలువైన మొక్కల్లో ఒకటిగా పేరు గాంచిన పుదీనా వలన మనకు లభించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.   ప్రత్యేకమైన సువాసన కూడిన ఈ పుదీనా ఆకు మన మెదడుని సానుకూలంగా ప్రభావితం చేసే శక్తిగా పరిగణిస్తూ ఉంటాం. 

గ్రీన్ చట్ని తయారీలో, బిర్యానిలో తప్ప దీనిని తప్పని సరిగా ఉపయోగిస్తూ ఉంటాం. దీనిలో ఔషధ గుణాలతో పాటు, జీవక్రియని సమర్దంగా నడిపించే పోషకాలు చాల పుష్కలంగా ఉన్నాయని పరిశోధనలు తెలుపుతున్నాయి.  చాలా రకాల వ్యాధులకి తయారు చేసే ఔషధాల్లో పుదీనా  ఎక్కువ శాతం వాడకంలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్‌ ఉంది. 

పుదీనా ఫ్లేవర్‌తో తయారైన ఏ ప్రొడక్టకైనా ప్రపంచవ్యాప్తంగా వినియోగం అధిక సంఖ్యలో ఉందనడం అతిశయోక్తికాదు. ముఖ్యంగా మౌత్ ఫ్రెషనర్స్ లో పుదీనా ఆకుల్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. పుదీనా ఆకులో వెలకట్టలేని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి అని అనేక పరిశోధనలు తెలియ చేసాయి.  

దీనివలనే వివిధ రకాల టూత్ పేస్ట్, చూయింగ్ గమ్స్, బ్రీత్ ఫ్రెష్నర్స్, క్యాండీస్ మరియు ఇన్ హేలర్స్ లో ఎక్కువగా పుదీనాను ఉపయోగిస్తున్నారు. ఈ పుదీనా ఆకులు
మన శరీరంలోని  బ్యాడ్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అంతేకాదు  శరీరంలోపల మరియు బయట చల్లగా ఉంచుతుంది. జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలకు పుదీనా ఆకు ఔషదంగా పనికి వస్తుంది.

విటమిన్ ఎ, విటమిన్ సి గుణాలు అధికంగా పుదీనా ఆకులో ఉన్నాయి. పుదీనాను గుడ్డుతో చేర్చి ఆమ్లెట్ ను కొత్తిమీరకు బదులుగా వేసుకుంటే చాల రుచిగా ఉంటుంది. ఇదే విధంగా పుదీనా మరో నాలుగు విధాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అలర్జీలను తగ్గిస్తుంది పుదీనా ఆకుల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు రోస్ మ్యారిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్న నేపధ్యంలో మనకు జీర్ణ సంబంధమైన సమస్యల నుండి బయట పడటానికి పుదీనా ఆకులు ఎంతగానో ఉపయోగ పడతాయి.  

రెండు స్పూనుల పుదీనా ఆకు రసంలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ మూడుసార్లు తీసుకుంటే కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం తగ్గుతాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలతో కూడిన పుదీనా ఆకుతో రకరకాల వంటలను కూడ చేసుకోవచ్చు.  ఈ పుదీనా ఆకును ఎక్కువగా ఉపయోగించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: