ఆరోగ్యానికి ఆహారం - ప్రతిరోజు శృంగారం


ఈ మద్య కాలంలో  వివాహం అయిన తర్వాత ఒకరిద్దరు పిల్లలు పుట్టగానే దాంపత్య / వైవాహిక జీవితం పై అనాసక్తి పెరుగుతుంది. దీనికి గల కారణాలు -ప్రతిరోజు పని వత్తిడి,  ఆర్థిక ఇబ్బందులు లేదా  ఆరోగ్య సమస్యలు.  ఇలాంటి కారణాల వల్ల చిన్న వయసులోనే శృంగారం / సెక్స్ పై వ్యామోహం తగ్గిపోతుంది. కానీ పూర్వ కాలంలో వివాహితులు ప్రతి రోజూ శృంగారం లో పాల్గొనటం వలన  ఆరోగ్యపరం గా ఎంతో మేలు జరిగేదని వైజ్ఞానికులు చెబుతున్నారు. అందుకు నాలుగు కారణాలు చెప్పవచ్చు.


శృంగారం అనేది వ్యాయామం లాంటిదనే విషయం అందరికీ తెలిసిందే.

శ్వాస రేటు క్రమంగా పెరిగి ఎక్కువ కాలరీల శక్తి ఆవిరై - కోలెస్ట్రాల్ శాతం తగ్గి శరీరం ఫిట్నెస్ సంతరించు కొంటుంది.  ఒక రైతు పొలంలోనో, ఒక కార్మికుడు ఫాక్టరీలోనో కష్టపడినంతన్న మాట అంటే ఎంతో శ్రమ పడినట్లు.

వారానికి మూడు సార్లు 15 నిమిషాలు శృంగారములో పాల్గొనటం వలన ఏడాదికి 7.500 కాలరీల శక్తి పోతుంది. ఇది 75 మైళ్లు జాగింగ్ చేసినంత ప్రయోజనం ఇస్తుంది.

శృంగారం సమయంలో అధిక  శ్వాస తీసుకోవడం జరుగుతుంది.  దానివల్ల శరీరంలోని కణాలకు విరివిగా ఆక్సిజన్ అందుతుంది.

శృంగారంలో ప్రతి రోజూ పాల్గొనడం వల్ల ఎనలేని ప్రయోజనాలు ఉంటాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. దంపతుల మధ్య బంధం పటిష్టం కావడమే కాకుండా పగటి పూట రోజూవారీ పనుల్లో చిరాకు, ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు. ఉదయం చేసే జాగింగ్ కంటే ఎన్నో రెట్లు సెక్స్ ఉత్తమం అంటున్నారు వైద్య నిపుణులు.


అంతేకాదు.. అలసిపోయి ఇంటికొచ్చిన వెంటనే మీకు నచ్చిన స్వీట్స్ తీసుకోవడం ద్వారా స్టామినా పెంచుకోవచ్చని, తద్వారా రోజంతా కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పడకగదిలో దూరి మీ భాగస్వామిని రెచ్చగొట్టి, ఊపేయడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. అలసిపోయిన దేహానికి, మనసుకు ఊరటనిస్తూ ఆ తర్వాత ఆనందాన్ని జుర్రుకోవడానికి అవి పనికి వస్తాయని అంటున్నారు. శృంగారానికి ముందు ఆహారాల్లో పచ్చికూరలు, చేదుగా, వగరుగా ఉండే కూరగాయలు తినడం కన్నా కొన్ని ఆరోగ్యకరమైన తీపి పదార్థాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

 

తియ్యని పదార్థాలు తీసుకుంటే మీ భాగస్వామితో సంభోగం కూడా మధురంగా ఉంటుందని చెబుతున్నారు. సలాడ్స్‌లో టమోటోల ముక్కలను జోడించి డిన్నర్‌కు ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శృంగారానికి ముందు ఒక గ్లాస్ బాదం మిల్క్ త్రాగడం వల్ల మంచి శక్తినిపొందవచ్చు. ఫిగ్స్ లేదా అత్తిపండు లో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉండి, లిబిడోను మెరుగుపరుస్తుంది. శృంగారంలో పాల్గొనడానికి ముందు చాక్లెట్ తినడం వల్ల మీ స్టామినా పెరుగు తుంది. చాక్లెట్ తింటూ టీవీల్లో భామలు కోరికలతో రగిలిపోయే  బుసకొట్టించే దృశ్యాలను చూసే వుంటారు. ఆక్రోట్, తేనె, క్యారెట్, వాటర్ మిలన్, దానిమ్మ, బొప్పాయి, మామిడి,  కర్జూరం  వంటి ఫ్రూట్స్‌ను సలాడ్ రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని, శరీరానికి కావలసిన శక్తి సమకూరుతుందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. శృంగారంపై ఇష్టాన్ని జీవించి ఉన్నంత కాలం కొనసాగించాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: