డబ్బు విషయంలో పిల్లలతో జాగ్రత్త సుమా..!

డబ్బు గురించి పిల్లలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వివరించాలి. డబ్బు విషయంలో మంచి అలవాట్లు, తర్వాత జీవితంలో అనేక రకాలుగా ఉపయోగపడతాయి. తల్లిదండ్రుల అలవాట్లు పిల్లలకు త్వరగా అలవడతాయి. ఆర్థికపరమైన విషయాలను పిల్లలకు ఖచ్చితంగా వివరించాలి. పిల్లలకు చదువు, నాలెడ్జ్ మాత్రమే కాదు, డబ్బు విషయంలో కూడా కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్పించాలి. చిన్నప్పటి నుంచే, డబ్బు విలువ, భవిష్యత్ అవసరాలను తెలియజేయడం వల్ల, భవిష్యత్ లో ఎలాంటి ఆర్థిక సమస్యలను ఫేస్ చేయకుండా ఉంటారు.


వేచి చూడాలి: ఏదైనా కావాలి అనుకున్నప్పుడు, దానికోసం వెయిట్ చేయాలిల్ డబ్బు ఆదా చేసుకున్న తర్వాత కొనాలని నేర్పించాలి.

ఆలోచించాలి: ఏదైనా కొనే ముందు ఆలోచించాలి అని నేర్పించాలి. ఉదాహరణకు సూపర్ మార్కెట్ కి వెళ్లేముందు, బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏవి కొనాలి, ఏ షాప్ కి వెళ్లాలి, ఒక్కో దానికి ఎంత ఖర్చు అవుతుంది, అనే విషయాలపై ఒక ప్రణాళిక ఉండాలని పిల్లలకు సూచించాలి.


ఆదాచేయడం: ఎంత డబ్బు ఆదా చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయాలను నేర్పించాలి. అలాగే వాళ్లు ఒక నెలలో ఎంత ఆదా చేయాలి అనే దానిపై అవగాహన కల్పించాలి. దాన్నిబట్టి ఖర్చులు ప్లాన్ చేసుకోవాలని తల్లిదండ్రులు పిల్లలకు సూచించాలి.

అవకాశాలు ఇవ్వడం: పిల్లలకు చాలా విభిన్నంగా, వాళ్లు కావాల్సిన వస్తువులు కొనే విధానాన్ని నేర్పించాలి. వీడియో గేమ్ కొనాలి అంటే, షూస్ కొనడానికి డబ్బు ఉండదని చెప్పాలి. ఇలాంటి ఆప్షన్స్ ఇవ్వడం వల్ల డెసిషన్ మేకింగ్ స్కిల్స్ పెరుగుతాయి.


ఇవ్వడం గురించి: కొంత డబ్బును సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత, పిల్లలకు ఇవ్వడం కూడా నేర్పించాలి. ఏదైనా చారిటీ వంటి వాటికి, కొంత డబ్బును సహాయంగా ఇచ్చే అలవాటును నేర్పించాలి.

తప్పులు చేయడం: ఎవరూ అన్ని సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి కొన్ని సందర్భాల్లో తప్పు చేయవచ్చు. అలాంటప్పుడు వాళ్లు మరోసారి తప్పు చేయకుండా ఆలోచించడానికి అనుభవం వస్తుంది.


ఎలా నిర్ణయం తీసుకోవాలి: ఏదైనా కొనేటప్పుడు కామన్ సెన్స్ ఉపయోగించేలా ప్రోత్సహించాలి. ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు కొనేముందు రీసెర్చ్ చేయడం, కొనడానికి సరైన సమయం వరకు వేచి చూడటం, చాయిస్ టెక్నిక్ ద్వారా కొనే విధానాన్ని నేర్పించాలి.

బిల్స్ ఎలా పే చేయాలి: వాళ్లు సంపాదించిన డబ్బులో నుంచి ఎంత మొత్తాన్ని ఏ బిల్ పే చేయడానికి ఉపయోగించాలో నేర్పించాలి. ప్రతి నెలా, ఇలా బిల్ కట్టడం అలవాటు చేయడం ద్వారా జీవితంలో చాలా ఉపయోగపడుతుంది


పనిచేయడానికి అవకాశం: వాళ్లకు కావాల్సిన డబ్బు వాళ్లు పొందడానికి, వాళ్లు వర్క్ చేసేలా ఎంకరేజ్ చేయాలి. పార్ట్ టైం జాబ్స్ చేయడం ద్వారా వాళ్లు పెరిగే కొద్దీ డబ్బు సంపాదించాలనే ఆలోచన పెరుగుతుంది.

తల్లిదండ్రుల ద్వారా: పిల్లలు డబ్బు గురించి రెండు రకాలుగా నేర్చుకుంటారు. ఒకటి వాళ్ల సొంత అనుభవం ద్వారా రెండోది తమ తల్లిదండ్రులను చూసి నేర్చు కుంటారు. వాళ్లు ఆర్థికంగా సక్సెస్ అవడానికి, వాళ్లకు తల్లిదండ్రులే మోడల్ అవ్వాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: