సెక్స్ తరవాత అబ్బాయిలు నిద్రలోకి జారుకుంటారు ఎందుకు?

చాలామంది మహిళలు శృంగారం తర్వాత మగవాళ్లు నిద్రపోతున్నారని పిర్యాదు చేస్తుంటారు.  అయితే మహిళలు శృంగారం తర్వాత తన భాగస్వామి నుండి చాలా ఆశిస్తారు.  అందుకే సెక్స్ తర్వాత మగవాళ్లు పోతుంటే  వాళ్లకు చాలా ఆగహం కట్టలు తెంచుకుంటుంది. 

మహిళలకు కౌగిలింతలు, ముద్దులు, ప్రేమతో మాటలు, స్వీట్ నథింగ్స్  కావాలని కోరుకుంటారు. కానీ, మగవాళ్లు మాత్రం చాలా కష్టపడిన తర్వాత, క్యాలరీలు కరిగిపోవడం తో వెంటనే నిద్రపోవాలని భావిస్తారు. మగవాళ్లకు శృంగారం వ్యాయామం లాంటిది. కాబట్టి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన తర్వాత  విశ్రాంతి  ని కోరుకుంటారు. చాలా అలసిపోవడం వల్ల వెంటనే నిద్రలోకి జారు కుంటారు. శృంగారం తర్వాత మగవాళ్లనిద్ర వెనక చాలా కారణాలున్నాయి. అవేంటో మీరేచూడండి.



ఆందోళన: శృంగారం సమయంలో శరీరం సాధారణంగా విశ్రాంతి  కోరుకోవటం జరుగు తుంది  శాస్త్ర పరిశోధనలు ఋజువు చేస్తున్నాయి, సాక్ష్యాధారాలతో సహా. అలాగే మెదడు కూడా చాలా ఆందోళనలు, తెలియని భయాలకు గురవుతుంది. కాబట్టి శృంగారం చేసిన వెంటనే నిద్రపోతారు మగవాళ్లు.



నిద్రమత్తు: సాధారణంగా.. శృంగారం రాత్రిపూట ఉంటుంది. అది కాకుండా మగవాళ్లు ఆ సమయంలో నిద్రమత్తు లో ఉంటారు. అలాగే సెక్స్ సమయంలో మగవాళ్లు చాలా కష్టపడ తారని గుర్తు పెట్టుకోవాలి.



పారవశ్యం:  సాధారణంగా మగవాళ్లు పారవశ్యంలో ఉన్నప్పుడు వాళ్ల మైండ్ “సుషుప్తావస్థ” -నిద్రలాంటి మరో అదోరకమైన మత్తైన మానసిక స్థితి లోకి జారుకొంటుంది.   క్రమంగా ఆ మానసిక స్థితి నిద్రగా మారిపోరుంది.  

కాబట్టి అతను నిద్రమత్తుగా ఫీలవుతారు. మహిళలకు ఇలాంటి ఫీలింగ్స్ కలగవని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే, శృంగారం తర్వాత ఆడవాళ్లు మగవాళ్లు నిద్ర పోవడాన్ని ఇష్టపడరు.



మెదడులో: శృంగారం సమయంలో మగవాళ్ల మెదడులో కొన్ని రకాల రసాయనాలు స్రావాలు విడుదలౌతాయి  అవుతాయట. ప్రొలాక్టిన్, వాసోప్రెస్సిన్, నిట్రిక్ ఆక్సిడ్, సెరోటనిన్, ఆక్సిసిన్ వంటి రసాయనాలు  రిలీజ్ అవడం వల్ల మగవాళ్ల నిద్రపోవాలని ఫీలవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి

స్ఖలనం:  స్ఖలనం అయిన వెంటనే మగవాళ్లు,  మూడ్ కోల్పోతారని,  అందుకే వెంటనే వాళ్లు నిద్రపోవాలని ఫీలవుతారని, అధ్యయనాలు చెబుతున్నాయి.



అనుకూలంగా:  మగవాళ్లు శృంగారం అయిన వెంటనే,  చాలా  అనుకూలంగా   పీలవు తారట.. అందుకే నిద్రపోవాలని భావిస్తారు.

నిద్రపై ఆసక్తి: మరికొంత మంది ఎక్కువ మాట్లాడే తత్వం ఉండదు. అందుకే శృంగారం వెంటనే నిద్రపోవడానికి ఆసక్తిచూపుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: