మహాభారత పాత్రల ద్వారా "పర్సనాలిటి డెవలప్మెంట్"

మహాభారతం భారతీయ సంస్కృతి సాంప్రదాయ వారసత్వానికి పట్టుగొమ్మ. అంతే కాదు అది ఒక వ్యక్తిత్వ  వికాసగ్రంధం కూడా. మహాభారతంలోని ఒక్కో పాత్ర ఒక్కో  వ్యక్తిత్వ లక్షణాన్ని ప్రదర్శిం చేదే. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క స్వభావానికి ప్రతీక. జీవితంలోని విశిష్ట వైదుష్యానికి వైరుధ్యానికి విభిన్న సంఘటలనికి ఈ గ్రంధం ఆలవాలం. మహాభారతం భారత దేశ సమగ్ర స్వరూపం. బయట జరిగేదంతా ఈ గ్రంధంలో ఉంది. ఇందులో ఉన్నదంతా సమాజములో (జరుగుతూనే)  ఉంది. సమాజానికి మహా భారతం ప్రతిబింబం.


పాత్రల స్వరూప స్వభావాలను ఒక పాత్ర ద్వారా పరిశీలిద్ధం. మొదటగా ధృతరాష్ట్రుణ్ణి, ధర్మరాజుని ఉదాహరణగా చూద్ధాం.



ధృతరాష్ట్రుడు: 


పేరుకే ధృతరాష్ట్రుడు  కురువంశ సార్వభౌముడు. తొలుత భీష్ముని   సారధ్యంలో పాలన నడిచేది ఎంకంటే ఇతను పుట్టు గుడ్డివాడు.  కౌరవులు  కౌమార్యం దాటాక భీష్ముని  మార్గదర్శనం తగ్గిపోయింది. ఆ తరవాత ఆడించేది, పెత్తనం చలాయించేది దుర్యోధనుడే. పేరొకడిది - పరిపాలన, అధికారం మరొకడిది. ధృతరాష్టుని మాటకి, సలహాకి ఏమాత్రం విలువలేదు.




తిరుపతి వేంకటకవులు అన్నట్టు ధృతరాష్ట్రుని "చూపు మాత్రమే గుడ్డి కాదు - అతని వాక్కు కూడా గుడ్డిదే".  ఇవాళ రాజకీయా లూ ఇలానే ఉన్నాయి. భార్యను అధికారం లో ఉంచి తెరవెనుక భాగోతం నడిపించే భర్తలు మనకు ఎందరో తెలుసు. కాంగ్రేస్ పాలనలో మన్మోహన్ సింగ్ ప్రధాని ఐనా, అసలు సూత్రధారిణి సోనియా గాంధీ యే అనటం వింటున్నాం. చూశాం కూడా! ధృతరాష్ట్రునికి అధికారశక్తి ఉంది, కాని వినియోగించుకోలేని దైహిక మానసిన అశక్తుడు.




కొడుకైన దుర్యోధనుడు చేసే పనులేవీ అతనికి ఇష్టం కాదు. కానీ వారించలేడు. దానికి కారణం  "పుత్రవాత్సల్యం". అది కూడా మితి మీరిన పుత్రవాత్సల్యం. ఒక పక్క ఎందరో సముచితం కాదంటున్నా కొడుకును మందలించలేని గారాబం – పుత్ర వ్యామోహం. ఏ తండ్రికై నా మితిమీరిన పుత్రవ్యామోహం కూడదు.




ఉదాహరణకు వైఎస్ రాజశెఖర రెడ్డి. మితిమీరిన పుత్రవాత్సల్యమే ఆయనను మరణానంతరం కూడా నేరస్తునిగా నిలిపింది ప్రజాధనాన్ని దోచిన వాడిగా  ముద్రపడేలా చేసింది.  అది కూడా ఆయన్ను మించిన పుత్రవాత్సల్యం కలిగిన చంద్రబాబు నాయుని సమక్షంలొ.  బాబు  కూడా  పుత్రవాత్సల్య పీడితుడే. కాకపోతే బ్రతికే ఉన్నాడు, అదీ  పదవిలో ఉన్నాడు. అందుకే పాపకూపాన్ని కప్పి పెడుతూ ఉన్నాడు.


పుత్ర వ్యామోహం, పుత్రవాత్సల్యం వుంటే కొడుకులు ఎలా తయారవుతారో, వంశం ఎలాపతనమౌతుందో మహాభారతం ద్వారా తెలుస్తుంది. కొడుకును ప్రేమిస్తూనే సన్మార్గంలో పెట్టలేని తండ్రి, తండ్రి కాదని ఈ పాత్ర చెప్తుంది.




ధర్మరాజు:


అందరూ ఈయనను అజాతశత్రువు అంటారు. సహనం శాంతి మూర్తీభవించిన స్థితప్రజ్ఞుడు అంటారు.  తననూ తన సొదరుల్నీ కౌరవులు అవమానిస్తుంటే, తన అర్ధాంగికి ఘోరపరాభవం జరుగుతుంటే ధర్మరజుకి ఇష్టమా?  శాంతిజపం ఎందుకు జపిస్తున్నాడు?  కక్షలేదా? ఎందుకుండదు!  కానీ స్వయంకృతాపరాధం! కొనీతెచ్చు కున్న విపత్తు! ఎంతటి ప్రజ్ఞావంతుడైనా ఏదొ సమయంలొ మానసిక బలహీనతకు లొంగిపొతాడు. చేయరానిది చేస్తాడు.తప్పని తెలిసినా చేస్తాడు.


విశ్వామిత్రుడు మేనకకు ఒక బలహీన క్షణంలో  లొంగిపోయి పతనమయ్యాడు. బిల్ క్లింటన్ కూడా మోనికా లెవెన్స్కీ కి లొంగిపోయాడు. అంతే, మానవుని బలహీనత అదే! ధర్మరాజుకీ ఇదీ తప్పలెదు-అదే జూదవ్యసనం! అన్నీ కొల్పోయినా - భార్యను పందెం ఒడ్డటం చేశాడంటే ఎంతటి బలహీనతో ఆలోచించండి. 




"తప్పుచేయటం మానవ ధర్మం "  అంటారు గదా!  తనే తప్పుచేసినవాడు ఎలా వ్యతిరేకించగలడు? అందుకే తలవంచు కున్నాడు ధర్మరాజు.  కానీ,  లో లోపల ద్వేషం లేకపొలేదు.  కౌరవుల అన్యాయం తెలుసు.కానీ తనదీ తప్పు వుంది.అందుకే ఊదాసీనత. మనలో తప్పున్నప్పుడు ఎవరిమీదా ఆగ్రహించటం సముచితం కాదు.


తిక్కన అంతటి కవి బ్రహ్మ ధర్మరాజును ఏమన్నాడో తెలుసా?  "మెత్తని పులి".  ఇది చాలా ఆలోచించి అన్నమాట! ఏంతో అర్ధవంతమైన మాట! ఇది అక్షర సత్యమైన వ్యాఖ్యానం. నిజంగా ధర్మరాజు మెత్తనిపులి!  పైకి మెత్తగా, శాంతియుతంగా కనిపిస్తాడు. కానీ, కాదు. ప్రతీకారవాంఛ వుంటుంది. కానీ సమయం,సందర్భం చూసుకోవాలి. కీలెరిగి వాత పెట్టాలి. ఆవేశంతో "కత్తికి కత్తి" అంటే అపకీర్తి తధ్యం. అందుకే సమయం కోసం ఎదురు చూశాడు.అంగబలాన్ని సమకట్టుకున్నాడు. అదను చూసి దెబ్బకొట్టాడు దాని ఫలితమే కౌరవ సామ్రాజ్య వినాశనం.




శత్రువుపై యుద్దం లేదా ఎదురుదాడిచేసినపుడు ఆవేశం, పరాక్రమం మాత్రమే సరిపోవు. రాజకీయ ఎత్తుగడ అవసరం. అందుకే శ్రీకృష్ణుణ్ణి రాయబారిగా పంపాడు. శ్రీకృష్ణుడు రాయబారం దండగ అన్నాడు!  ఫలితం శూన్యం అన్నాడు! అయినా ధర్మరాజు - లోకం కోసం రాయబారం చెయ్యమన్నాడు. ఇదీ లౌక్యం అంటే! మనం చేసే పనికి పదిమంది సమర్ధన కావాలి. ప్రజల మద్దతు కావాలి. అందుకోసం వెళ్ళమంటాడు ధర్మరాజు. ఇది యుక్తి మాత్రమే కాదు. లోక రీతి. ప్రజల ఆమోద ముద్ర కోసం ఆడే నాటకం. రాజకీయం.


పాకిస్థాన్ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతోంది. సాక్ష్యాలున్నాయి. అయినా మనం ఎందుకు దాడి చెయ్యటంలేదు? ప్రతిసారీ అమెరికా,రష్యా వంటి దేశాలకు "చూడండి, పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలు" అని మనం చెప్పడం దేనికి?  వాటిసహకారం కోసం. పాకిస్థానుపై వ్యతిరేకత వ్యాపింప జేయడం కోసం. పాపం! భారతదేశానికి ఎంత ఓర్పు- అని అగ్రరాజ్యాలు భావించడం కోసం. ఇదీ ధర్మజనీతి! అలా చెప్పిచెప్పి ప్రపంచంలో పాక్ ప్రతిష్ఠ  బలహీన పడగానే దెబ్బ కొట్టాలి అనే రాజనీతి. అప్పుడు ప్రజల మద్దతు లభిస్తుంది అంతే.


ధర్మరాజు సామాన్యుడు కాడు - మహామేధావి. ఎలా దెబ్బ కొట్టాలో అలా కొడతాడు. సహనం వహిస్తాడు. అశ్వత్థామ అనే ఏనుగు (కుంజరం) చచ్చిపోయిందని అబద్దం ఆడటానికి కూడా జంకడు. పైకి పెద్దమనిషిగా కనిపించినా, తనకీ, తన కుటుంబానికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే స్వభావం ధర్మరాజుది.




అందుకే తిక్కన వంటివాడు "మెత్తని పులి" అన్నాడంటే అందులో ఎంత అర్ధం వుంది? మన శత్రువును దెబ్బకొట్టాలి. కానీ ఎప్పుడు కొట్టాలి? ఎలా కొట్టాలి? అనేది ధర్మరాజు నుంచి మనం తెలుసుకోవాలి. ప్రతిదానికి  "ప్లానింగ్ ప్రణాళిక" అని చెప్పే పాత్ర ధర్మరాజుది.


ఇక ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ శాసన సభలో శాసనసభ్యురాలు రోజాపై  చంద్రబాబు నాయుడు సాధించ దలచిన  ప్రతీకార చర్య లో ప్రివిలేజెస్ కమిటీ ఏర్పాటు చేసి అంటే తన వంది మాగధులే అందులో ఉంటారు. పొల్లు పోకుండా తన మనసులోని ప్రతీకారం తీర్చుకునే అవకాశం "నివేదిక " రూపములో సిఫారసు చేసి ఆమెపై చర్యకు ఉప క్రమించటానికి మార్గం సుగమం చేస్తారు. అంటే "అధికారిక ఆమోద ముద్ర" వేయించి ప్రివిలేజస్ కమిటీ రికమండేషన్స్ అధారంగా ఆమె పై వేటు వేస్తారు. పగ ప్రతీకారం చట్టబద్ధంగా చంద్రబాబు సాధిస్తున్నారన్నమాట.




ఎంత పగ లేకపోతె శాసనసభ నుండి రెండేళ్ళపాటు రెండు దశల్లో ఆమెను బహిష్కరించిన తరవాత కూడా మహిళాసాధికారత సమావేశానికి ఆమెను ఆహ్వానించి ధారుణ పరాభవం చేసి అనుక్షణం అవమానించట మంటే ఒక అసాధారణ చర్య. దీనికి కారణం సభలో ఒకనాడు ఆయన్ని రోజా "కామ సిఎం"  అంటూ అవహేళన చేయటమే. దాని అర్ధం అందరికీ తెలుసు. కాని రోజా చెప్పేది మాత్రం "కాల్ -మనీ ముఖ్యమంత్రి"  అని.



ప్రజలు "వెన్నుపోటు"  ను ఎంతగా గుర్తుంచుకుంటారో ఈ "కామ సిఎం" ను అంతే గుర్తెట్టుకుంటారు. ఇదీ ప్రజామోద ముద్ర అంటే. భవిష్యత్ లో రోజా కూడా తను ఒక "పగబట్టిన పడతి"  కావచ్చు. చెప్పలేం?  చీర పట్టుకు గుంజిన దుశ్శాసనుని అంతు చూసిన ద్రౌపదిలా, కరుణానిధిని చెరసాల పాల్జేసిన జయలలితలా బాబుకు బల హీన క్షణాలు ప్రారంభంకాగానే రోజా విజృంభించవచ్చు  ఒక జయలలితలా! ఒక పాంచాలిలా! ఇదే ధర్మజ నీతి  "కౌటిల్యాన్ని మించిన కర్కశ నవనీతం"



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: