మహాభారత కాలం నాటి అత్యద్భుత శాస్త్ర విఙ్జానానికి ఋజువే జరాసంధుడు.



మహభారత పఠనం ధర్మ అధర్మ విచక్షణకేకాదు, సామాజిక, రాజకీయ, ఆర్ధిక అంశాలపై కూడా మనకు అవగాహన కలిగించగలదు. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగాలపై నేడు అత్యంత ఆధునికమని మనం అనుకుంటున్న పరిఙ్జానాన్ని ఆనాడే వినియోగం లో ఉన్నట్లు వేదవ్యాసుడు తన అద్భుత రచన లో పొందుపరచారు. మహాభారతాన్ని పంచమ వేదంగా పేర్కొంటారు. ఇందులో అనేక ఆసక్తికరమైన కథలే కాదు, సైన్స్ కు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ఆదరణ పొందుతోన్న టెస్ట్-ట్యూబ్ బేబీ, క్లోనింగ్, లైవ్-టెలికాస్ట్ లాంటి ఎన్నో విషయాలను వేదవ్యాసుడు కొన్ని వేలసంవత్సరాల కిందటే చర్చించాడు.


ఉదాహరణకు "గాంధారీదేవికి గర్భవిచ్చిత్తి (అబర్షన్) జరిగినప్పుడు ఆ గర్భజనిత ఖండాలను (ఫలదీకరణమైన పిండంలోని భాగాలను) వేర్వేరుగా 101 కుండల్లో పెట్టి వాటికి తగిన వాతావరణం పోషణ అందించి తద్వారా ఆ పిండ ఖండాలను బిడ్డలుగా అంటే "నూరుగురు కౌరవులు, ఒక్క కూతురు "దుస్సల"  గా జన్మింపజేసిన కథాక్రమణిక"  నేడు మనమనుకుంటున్న "టెస్ట్-ట్యూబ్ లో  'అండం వీర్యం సంయోగం'  చేసి పాపను సృష్టించటమనే -టెస్ట్-ట్యూబ్ బేబీ" నేడు సహస్రాబ్ధాల శాస్త్ర అభివృద్ది, నాగరికత అనంతరం చాలా అభివృద్ది చెందామని చెప్పుగోగల శాస్త్ర విఙ్జానం నాడే ఉండేదని తెలుస్తుంది.


దాన గుణంలో కర్ణుడితో సమానమైన ఒకే ఒక యోధుడు మాత్రం ఇద్దరు తల్లుల గర్భంలో సగం సగం పిండాలుగా పెరిగాడు. తూర్పుభారతంలో శక్తివంతమైన మగధ రాజ్యానికి చక్రవర్తి బృహథ్రదుడు.  ఈయనకు ఇద్దరు భార్యలు. వీరికి సంతానం లేకపోవడంతో తీవ్ర వేదన చెందాడు. పుత్ర సంతానం కోసం దశరధునిలా పుత్రకామేస్ఠి లాంటి యఙ్జం చేసైనా సంతానం పొందాలనే ఉద్దేశంతో  "చందకౌశికుడు" అనే మునీంద్రుణ్ణి ఆశ్రయించాడు. 


చందకౌశిక మహర్షి ఒక తపఃఫలాన్ని ఆ రాజేంద్రునికి ప్రసాదించి పట్టపురాణికి ఇవ్వమని చెబుతాడు. ఐతే అది మరచిన బృహథ్రద చక్రవర్తి ఆ ఫలాన్ని సగం సగం చేసి తనఇద్దరు పత్నులకు అందించాడు. ఆ తర్వాత చక్రవర్తిగారి ఇద్దరు భార్యలు గర్భం దాల్చారు. అయితే ఈ ఇద్దరూ సగం శరీరాలున్న శిశువులను మాత్రమే విడివిడిగా ప్రసవించారు. దీంతో బృహథ్రదుడు భయపడి రెండు  అర్ధ దేహాలను అడవిలో వదలివేస్తాడు. అదే సమయం లో ఆ అడవి గుండా జర అనే రాక్షసి ఆహారం కోసం వెళుతూ సగం శరీర భాగాలు కలిగిన శిశువులను చూసి తన శక్తులతో ఆ రెండింటినీ కలుపుతుంది. అంతే కాదు వాటికి ప్రాణం పోస్తుంది.


తర్వాత చందకౌశిక మహర్షిని దర్శనం చేసుకొని తన వ్యధార్త చరిత్రను చెప్పి తరుణోపాయం పొందటం కోసం ఆశ్రమానికి ప్రయాణమౌతాడు. బృహధ్రతుడు ముని దర్శనం చేసుకుని వెళ్ళి తిరుగు ప్రయాణమైన  వెళుతుండగా మార్గమద్యంలో  ఒక పసిబాలుడు ఏడుపు వినిపించడంతో అక్కడకు చేరుకుని ఆశ్చర్యపడతాడు. శిశువుల విడిభాగాలను కలిపిన స్త్రీని ఎవరమ్మా మీరు అని ప్రశ్నిస్తాడు. దీంతో ఆమె నా పేరు "జర" అనే రాక్షసిని అని తెలియజేస్తుంది. ఆ బాలుడు జర చర్యతో కలపబడి ప్రాణం పోసుకున్నాడు. జర చేత (సందుడు) అంటే దేహభాగాలను కలపబడిన వాడు కాబట్టి "జరాసంధుడు" అని నామకరణం చేస్తాడు. 


బృహధ్రతుడు మరణానంతరం మగధ సింహాసనాన్ని అధిష్ఠించిన "జరాసంధుడు" తన వంశాచారం ప్రకారం  గొప్ప శివభక్తుడు అవుతాడు. అంతే కాదు దానధర్మాల్లో కర్ణుడితో సమానంగా ఉండేవాడు. అడిగిన వారికి కాదనకుండా విరివిగా దానాలు చేసేవాడు. అయితే బృహథ్రద చక్రవర్తి వంశానికి యాదవులంటే ఆగర్భశత్రుత్వం ఉండేడి. అలాగే జరాసంధుడు కూడా బలరామ శ్రీకృష్ణులతో సహా యాదవులంటే ప్రతీకారంతో రగిలిపోయేవాడు.


అంతే కాదు ముఖ్యంగా తన అల్లుడైన కంసుని సంహరించిన కృష్ణుడంటే మరింత ఆగ్రహం. 'మిత్రుని మిత్రుడు శత్రువన్న సామెత' ను నిజం చేస్తూ పాండవులపై కూడా వైరం పెంచుకున్నాడు.  కాలగమనం లో తుదకు భీమునితో 14 రోజులు యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయాడు.


అయితే భీముడు యుద్ధం లో జరాసంధుడి శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చివేసినా తిరిగి ఆ రెండు దేహభాగాలు కలసిపోయేవి  జరాసంధుడు తిరిగి బ్రతికేవాడు రెట్టించిన ఉత్సాహంతో యుద్ధం చేసే వాడు. అలసి సొలసిన భీముడు శ్రీకృష్ణ వ్యూహంతో కూడిన సలహాతో దేహాన్ని రెండుభాగాలుగా చీల్చి కుడిభాగాన్ని ఎడమనైపుకు అడమ భాగాన్ని కుడివైపుకు అపసవ్యంగా విసిరి వేయటముతో దేహాలు అతుక్కొక పోవటం జరిగింది. ఆ విధంగా జరాసంధ మరణం సంభవించింది.  


17 సార్లు జరాసంధుని బలరామకృష్ణులు ఓడించినా పదే పదే మధురానగరంపై దాడిచేసే వాడు జరాసంధుడు. అందుకే తన మధురా నగరాన్ని ప్రజాక్షేమం కోసం సముద్రగర్భం లోకి తరలించారు బలరామకృష్ణులు. 


ప్రస్తుతం జరాసంధుడు పాలించిన ఆ ప్రాంతం బీహార్లోని రాజ్గిరి పట్టణం సమీపం లోని "జరాసంద్-కా-అఖారా" అని పిలవబడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: