పిల్లలు స్మార్ట్ ఫోన్స్ వాడితే ఏమవుతుందో తెలుసా

Narayana Molleti

సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగం అయిపోయింది. తిండి లేక‌పోయినా ఆగుతున్నారు గాని సెల్‌ఫోన్ లేకపోతే అస్స‌లు ఆగ‌డం లేదు. అలా త‌యారైపోయాడు మాన‌వ‌డు. మోడ్ర‌న్ స‌మాజంలో టెక్నాల‌జీ పెరుగుతోన్న కొద్ది ఈ పరికరాల వినియోగం అమాంతం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కంప్యూటర్లు,  సెల్ ఫోన్లు లేని ప్రపంచాన్ని ఊహించలేం. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ సెల్ ఫోన్ తప్పనిసరి అయ్యింది.


అయితే ఈ టెక్నాల‌జీకి మాన‌వుడు ఎంత‌లా బానిస అవుతున్నాడో అంతే ప్ర‌మాదాల్లో చిక్కుకుంటున్నాడు. స్మార్ట్ ఫోన్లు ఎక్కువుగా వాడ‌డం వ‌ల్ల ఉన్న పెద్ద డేంజ‌ర్ ఏంటంటే ఈ సెల్ ఫోన్ల ద్వారా మైక్రోవేవ్స్ అనే సూక్ష్మతరంగాలు అతి సులభంగా శరీరంలోకి చొచ్చుకుపోగలుగుతాయి. ఇలా శరీరంలో నుంచి ప్రయాణించే మైక్రోవేవ్స్ ద్వారా శరీరకణాల్లో కొన్ని అవాంఛనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయని.. అవి భవిష్యత్తులో మనకు ప్రమాదకరంగా పరిణమిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


అందుకే పిల్లలు పెద్దలు కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లను పరిమితంగా ఉపయోగించాలి. స్మార్ట్ ఫోన్లను పడకగదిలో ఉంచకూడ‌దు. స్మార్ట్ ఫోన్ల‌ను పిల్లలకి ఎంత దూరంగా ఉంచితే అంత బెటర్. సెల్ ఫోన్లు పిల్లల మెదడుపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి అందుకే గేమ్స్ కోసం ఫోన్లను అలవాటు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: