యువత తొలిచూపులోని ప్రేమ కాదు...ఆకర్షణే!

మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం అందులో కథానాయిక లేదా కథానాయకుడు తనకు కనిపించిన ఆపోజిట్ సెక్స్  తన్మయానికి లోనై ఒక్కసారి చూడగానే 

"అబ్బ! ఏమున్నడ్రా బాబు!" 

"పిల్ల కత్తిలా ఉంది" 

అనే డైలాగ్స్ వింటూనే ఉంటాం! దీన్ని బట్టి అది తొలిచూపులోనే పడిపోయామంటారు. కవితలు చెపుతారు కథలు రాస్తారు. నిజానికి కొందరు తొలిచూపులోనే ప్రేమలో పడ్డామనేవాళ్ళు-నిజంగా ఆకర్షణకులోనైన ప్రేమికులే. ఇది 'జూరిచ్ యూనివర్సిటీ పరిశోదకులు చేసిన పరిశోదన నివేదిక'  తొలిచూపు ప్రేమకు హృదయస్పందనలకు ఎలాంటి సంబందం లేదన్నారు. 


"తొలిచూపు ప్రేమ భౌతిక సౌందర్యానికి మాత్రమే వర్తిస్తుంది. తొలిచూపులో ప్రేమలో పడిపోయి ప్రేమించినా అది ప్రేమే కదా! ఆ తరవాత ఆ బందం క్రమంగా ప్రేమగా మారుతుంది. ఆన్ లైన్ లో మూడు డేటింగ్ సంఘటనలను మా ప్రయోగశాల నుండి డేటా సేకరించి-తొలిచూపులో ప్రెమకలగటం అనేది "ప్రేయసి అందం" ద్వారానే అని, అలా ప్రారంబమైన ప్రేమ కూడా ప్రేమే నని ఆ తరవాత ఆ ప్రేమ హృదయస్పందలను ప్రేరేపింపచేస్తుందని చెప్పారు. 


“రాకుమారుడు హారీ, మేఘన్స్ మార్కిల్ తొలిసారి కలసినప్పుడు తాము ప్రేమలోపడ్దామని తమది ఎన్నెన్నోజన్మల బంధం అని అనుకున్నామని” వారి ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో ప్రకటించారు. 


ప్రేమకు, తొలిచూపులో ప్రేమకు - పెద్ద భెదం ఉండని కూడా వారు చెప్పారు. ఈ ప్రేమను ఈ ఆలోచనను శాస్త్రవేత్తలు విభేదించినా – తరవాత మాటా ముచ్చట్లతో వారి ప్రేమ బంధం బలపడి ఉంటుందని తమకు తెలియకుండానే తాము ప్రేమించుకున్నామని వారనుకుని ఉంటారని ప్రేమ శాస్త్రవేత్తలు భావించారు. 

అయితే తొలిచూపు ప్రేమ, ఆకర్షణ అనటానికి ఒక బ్రిటీష్ మనోవైఙ్జానిక శాసత్రవేత్తల బృంద అధ్యయన సంఘం ఆ తరవాత వారి పరిశోధనల అనంతరం "జూరిచ్ నివేదిక"ను విమర్శించింది. కొంత మంది "సంశయవాదులు, ప్రేమశాస్త్రవేత్తలు" పాల్గొ న్న ఈ చర్చా కార్యక్రమంలో ప్రేమకు ఆకర్షణతో పాటు అనేక ఇతర విషయాలు దొహదం చేసి ఉంటాయన్నారు. ఈ డేటా సమీకరణ విశ్లేషణలో 396 మంది యువతీ యువకులైన డచ్ & జర్మన్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. అందులో 60% వనితలే.  



ప్రేమ ఎలా పుట్టిందని అడిగిచూడండి, ప్రతి అబ్బాయి ఓ కవి అయిపోతాడు. ఆ అమ్మాయిని చూడగానే ప్రేమలో పడిపోయా నని చెబుతూవుంటారు. అమ్మాయిలు కూడా, ఫష్ట్-లుక్‌ లోనే ఫిదా అయిపోయామంటూ ఉంటారు. "లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌" (ఎల్ ఏ ఎఫ్ ఎస్) భావనను చాలామంది నమ్ముతారు. అయితే ఈ "తొలి చూపు కలిసిన శుభవేళ" కథలన్నీ అవాస్తవం అంటు న్నారు నెదర్లాండ్స్‌ పరిశోధకులు! తొలిచూపులోనే ప్రేమ పుడుతుందనడం భ్రమ మాత్రమే అంటున్నారు. కామమే లేదా ఆకర్షణే తొలి ప్రేమకు ప్రేమకు కారణమని యూనివర్సిటీ ఆఫ్‌ గ్రానింగెన్‌ మనోవైఙ్జానిక శాస్త్రవేత్తలు తేల్చారు. ప్రస్తుత "రొమాంటిక్‌ రిలేషన్‌-షిప్" డచ్‌, జర్మనీలకు చెందిన 396 మంది విద్యార్థుల పై ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించారు. 



పరిచయం లేని వ్యక్తుల ఫోటోలను చూపించి, మనసులో కలిగే ప్రేమ, తపన, నమ్మకం వంటి స్పందనలకు అనుభూతులకు "రేటింగ్‌" ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత "స్పీడ్‌ డేటింగ్‌ టెస్ట్‌" నిర్వహించారు. యువతీ యువకులను ఎదురెదురుగా కూర్చో బెట్టి 20 నిమిషాలు మాట్లాడుకునే అవకాశం ఇచ్చారు. తర్వాత "లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌" ఫీలింగ్‌ కలిగిందా? అని ప్రశ్నించారు.
 


అమ్మాయిగాని అబ్బాయిగాని పరస్పరం నచ్చడానికి కారణమేమిటో వివరించమన్నారు. మొత్తం పరీక్షల్లో రూపానికి, అందానికే ఎక్కువ ఆకర్షితులయ్యామని అత్యధికులు తెలిపారు. తొలిచూపులోనే ప్రేమలో పడిపోయామన్న భావనను "స్పీడ్‌ డేటింగ్‌" లో పాల్గొన్న ఏ జంటా వ్యక్తం చేయలేదు. ఇప్పటికే రొమాంటిక్ రిలేషన్‌-షిప్ లో ఉన్న జంట లనూ ప్రశ్నిస్తే,  పరస్పర ఆకర్షణ, మోహం మొదలైన వాటిపై గౌరవంతోనే తమ మధ్య బంధం బలపడిందన్నారు. మొత్తానికి సినిమాల్లోలా "లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌" లేదంటు న్న మనస్తత్వ నిపుణులు ఆకర్షణ  కామమే ఎల్ ఏ ఎఫ్ ఎస్( తొలి చూపుప్రేమ) కు మూలమంటూ తమ పరిశోధనకు శుభం పలికారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: