భారత్ లో దైవం మరియు శృంగారం: శోభా డే

అస్పష్ట ప్రకటనలు సమాజంలో వివాదాస్పదమయ్యే విషయాలపై సున్నిత అంశాలపై నిర్భయంగా తన ప్రకటనలు చేయటంలో ధిట్ట.  భారతీయ రచయిత్రి శోభ డే. ఇంగ్లీష్ లో  మూడక్షరాల పదాలైన దైవం మరియు శృంగారం (God & Sex) రెండూ భారత్ లో బెదిరింపులకు భయాలకు  గురయ్యే అంశాలని చెప్పారు.


 మొన్న దేశ రాజధాని డిల్లి లో జరిగిన  'Sixth edition of Kushvanth Singh Literary Festival' లో మాట్లాడుతూ  "భారత్ శృంగారం విషయంలో ప్రపంచాన్ని మోసం చేస్తుందని"  శోభా డే వ్యాఖ్యానించారు.  ప్రపంచ ప్రజలు ఇప్పటివరకు  "భారతీయులు శృంగార ప్రియులని, శృంగారాన్ని చక్కగా అనుభవిస్తూ ఇతర ప్రపంచ దేశాల్లో లాగే వినోదం పొందు తున్నారని  అనుకుంటు న్నట్లు ఉందన్నారు"   కాని ఇక్కడ వారి అభిప్రాయం తప్పని దైవం & శృంగారం అనే మూడక్షరాల పదాలని  "భయపెడుతూ హింసాత్మక కార్యక్రమాలను ప్రత్యేక లక్ష్యాలకోసం వాడుకుంటారని"  బల్లగుద్ది మరీ చెప్పారు. 

గత కాలపు సినిమాల్లో కథానాయకిని ఒక పవిత్రగా పతివ్రత గా మంచి దానిగా చూపిస్తూ వనితలను వంచిస్తూ వచ్చారని, కాని ప్రస్తుతం భారతీయ సినిమాలు అన్నీ రకాల మహిళల శృంగార మనోభావాలను భిన్న కోణాల్లో తెరకెక్కిస్తున్నారు. వాటిని ప్రేక్షకులు అద్భుతంగా తెరమీది సనివేశాలని ఆదరిస్తున్నా కూడా బహిరంగంగా మాట్లాడా లంటే భయపడే వాతావరణం ఇంకా నెలకొని ఉండటం శోచనీయమని అన్నారు.   'దేవుడు -సెక్స్ ఈ రెండూ  ఇండియన్స్‌ను వణికిస్తున్నాయి ఇండియా లాంటి దేశాల్లో 'సెక్స్' గురించి మాట్లాడటం, చర్చించటం అంత తేలికైన పని కాదని, ముఖ్యంగా మహిళలను సెక్స్ గురించి ఎడ్యుకేట్ చేయడాన్ని కూడా నీచంగా చూసే విషసంస్కృతి ఇక్కడ శతాబ్ధాలుగా భారత సమాజంలో పాతుకుపోయిఉందని  ఈ రకమైన వాతావరణం స్త్రీ స్వేచ్చను అడ్డు కుంటుందనేది చాలామంది ఫెమినిస్టుల వాదన.


'దేవుడు అన్న పదం లాగే సెక్స్ పదం' కూడా ప్రజలను భయపెడుతోందన్నారు. ఈ రెండింటిని హింసాత్మక కార్యకలాపాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. కామం  అన్న పదం చాలా పవిత్రమైనదని అందమైనదనీ,  కామసూత్రాల పేరుతో చేసేదంతా  ఒక జిత్తులమారి వ్యవహారమని, సమాజంపై హింసాత్మక లక్ష్యాలతో పెత్తనం చేయాలనే దృక్కోణం లో కూడుకున్నదని అన్నారు.


 శృంగారాన్ని భారతీయులు బాగానే ఆస్వాదిస్తారని ప్రపంచం మొత్తం అనుకుంటోందని, అయితే దేశంలో మాత్రం దానిని వేరేరకంగా ఉపయోగించుకుంటున్నారని శోభా డే అన్నారు. కొంతమంది తమ లక్ష్యాలను చేరుకోవడం కోసం సెక్స్ & గాడ్ వంటి పదాలను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. కసౌ లో జరిగిన కుశ్వంత్‌సింగ్ ఆరో ఎడిషన్ సాహితీ వేడుకలో  Kama and the difficulty of being good అన్న అంశంపై మాట్లాడుతూ శోభా డే ఈ వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: