బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ తీసుకోవడం ఉత్తమం అంటారు ఎందుకో తెలుసా !

Seetha Sailaja
ప్రతిరోజు ఉదయం మనం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను తీసుకోవడం చాలమంచిది అని అనేక అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ప్రస్తుతం అందరికీ ఒక సమస్యగా మారిపోయిన  ఊబకాయానికి సరైన సమాధానం ఓట్స్. ఇటీవల కాలంలో యువత ఎక్కువగా జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ మరియు నిలువ ఉంచిన ఆహారపదార్ధాలవైపు మొగ్గుచూపడం వల్ల భారీగా ఊబకాయాలు ఏర్పడుతున్న విషయం తెలిసిందే. 

ఇలాంటి పరిస్థుతులలో ఓట్స్ తీసుకోవడం వల్ల మన శరీరంలోని అధిక కేలరీల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా మధుమేహం అజీర్ణ సమస్యలతో బాధపడే వ్యక్తులు తప్పనిసరిగా తమ బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఓట్స్ ను తీసుకోవడం మంచిది అని వైద్యులు కూడ సలహాలు ఇస్తున్నారు. 

ఓట్స్ బరువును తగ్గించటానికి ప్రస్తుతం సిఫార్సు చేయబడిన అత్యంత సులభమైన ఆహారం. ఎక్కువ మొత్తంలో పోషక విలువలు ఉండడమే కాకుండా మానవ శరీరం యొక్క ప్రాధమిక పోషక అవసరాన్ని తీర్చటానికి సూచించదగ్గ ఆరోగ్యకరమైన ఆహారపదార్ధంగాఓట్స్ ను గుర్తిస్తున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం వారంలో 5 సార్లు కనీసం ఓట్స్ ఆహారంగా తీసుకోవడం మూలంగా శరీరంలోని క్రొవ్వులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతాయని తేలింది. 

ఓట్స్ మన శరీరంలోని చెడు కొవ్వును కరిగించే సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతే కాకుండా కండరాలను ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ ఓట్స్ లో అధిక నీటి నిల్వలను నియంత్రించే తక్కువ పిండి పదార్ధాలను కలిగి ఉంటాయి. ఓట్స్ వల్ల మన నడుము యొక్క చుట్టుకొలతను తగ్గించడంలో సహాయం చేస్తుంది. ప్రస్తుతం అందర్ని వేదిస్తున్న కొలెస్ట్రాల్ సమస్యలకు ఈ ఓట్స్ సరైన పరిష్కారం. ఈపరిస్తుతులలో తక్కువ పిండి పదార్ధాలు కలిగిన ఓట్స్ ను రోజూవారీ తీసుకోవడం మూలంగా అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చని పోషకాహార నిపుణులు మాత్రమే కాకుండా పరిశోధనలు కూడ తెలియచేస్తున్నాయి. అందువల్ల బ్రేక్ట్ ఫాస్ట్ లో ఓట్స్ ను తీసుకోవడం అలవాటుగా మార్చుకోవడం మంచిది..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: