బెండకాయలతో డయాబిటీస్ మాయం !

Seetha Sailaja
బెండకాయలతో రకరకాలకూరలను తయారుచేసుకుని ఆస్వాదించడం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అయితే మనకు రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందివ్వడంలో బెండకాయ అమోఘంగా పనిచేస్తుంది అని అంటున్నారు. బెండకాయలను తినడం వల్ల మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు అందడమే కాకుండా పలు అనారోగ్య సమస్యలు ఈ బెండకాయల వలన పరిష్కారం అవుతాయి. బెండకాయల్లో ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

ఇవి మన శరీరానికి పోషణను అందిస్తాయి. బెండకాయల్లో సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను ఎక్కువ సేపు ఉండేలా చేస్తాయి. దీనితో ఆకలిని ఈ బెండకాయలు బాగా తగ్గించడం వలన బరువు తగ్గాలి అని కోరుకునే వారికి ఇది మంచి ఆహారం. బెండకాయల్లో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నీరసం, అలసట రాకుండా చూస్తాయి. 

ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి బెండకాయలు చేసే మేలు అంతాఇంతా కాదు. బెండకాయలను తినడం వల్ల క్లోమగ్రంథిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. శరీరం ఇన్సులిన్‌ ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి అని పరిశోధకులు తెలియచేస్తున్నారు. అంతేకాకుండా శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించేందుకు బెండకాయలు దోహదం చేస్తాయి. వీటిని తినడం వల్ల ట్రై గ్లిజరైడ్లు, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయి. బెండకాయల్లో ఉండే విటమన్ కె ఎముకలను దృఢంగా చేస్తుంది. దీనికితోడు బెండకాయల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నందున వాటిని తింటే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది అని వైద్యులు కూడ ఒప్పుకుంటున్నారు. 

ముఖ్యంగా ఈ బెండకాయలు వల్ల మనలను తరుచూ పీడించే గ్యాస్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నిత్యం ఒత్తిడి ఆందోళనలతో సతమతమయ్యేవారు తమ ఆహారంలో బెండకాయలను చేర్చుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది అని అంటున్నారు. ఇలా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ బెండకాయలను మనం రోజు తీసుకునే ఆహారంలో వీలైనంత ఎక్కువగా తీసుకోవడం అన్ని విధాల మంచిది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: