గుమ్మడికాయ విత్తనాలతో ఆరోగ్యం !

Seetha Sailaja
గుమ్మడి కాయను చాలామంది ఇష్టపడి తింటూ ఉంటారు. ఈ గుమ్మడి కాయతో రకరకాల కూరలు స్వీట్స్ చేసునే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే కేవలం గుమ్మడికాయ మాత్రమే కాదు అందులో ఉండే విత్తనాలను కూడ తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగడం ఖాయం గుమ్మడికాయ విత్తనాల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి మన శరీరంలోని  కణజాలాన్ని రక్షిస్తాయి. గుమ్మడికాయ విత్తనాల్లో ఉండే విటమిన్ ఇ ఫీనోలిక్ సమ్మేళనాలు జింక్ తదితర పోషకాలు వల్ల మన శరీరానికి చక్కని పోషణ లభించడమే కాకుండా మన శరీర నిర్మాణానికి కూడ తోడ్పడుతాయి. 

రోజూ గుమ్మడికాయ విత్తనాలను తింటుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. గుమ్మడికాయ విత్తనాల్లో సమృద్ధిగా ఉండే అర్గినైన్ అనే సమ్మేళనం రక్తనాళాలు గట్టిపడకుండా చూస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా రక్షించడమే కాకుండా హైబీపీని తగ్గిస్తుంది. ఈక్రమంలో గుండె ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. అలాగే ఈవిత్తనాల్లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను సాగేలా చేస్తుంది. దీనితో రక్తం గడ్డ కట్టకుండా హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటుంది.  శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలు గుమ్మడికాయ విత్తనాల్లో ఉంది అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.


దీనికితోడు మధుమేహంతో బాధపడుతున్న వారు నిత్యం గుమ్మడికాయ విత్తనాలను తింటే రక్తంలో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంటాయని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు. అదేవిధంగా ఈ గుమ్మడికాయ విత్తనాలు వల్ల జీర్ణాశయంలో ఉండే హానికారక బాక్టీరియా వైరస్‌లు నశిస్తాయి అని లేటెస్ట్ అధ్యయనాలు తెలుపుతున్నాయి. 


ప్రస్తుతం అనేకమంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్న నేపధ్యంలో ఆ సమస్యకు కూడా ఈ గుమ్మడి విత్తనాలు ఎంతగానో పరిష్కరిస్తాయి. 
మూత్రాశయ సమస్యలు ఉన్నవారు నిత్యం గుమ్మడికాయ విత్తనాలను తినడం ఎంతగానో మేలు చేస్తుంది. కనీసం 3 నెలల పాటు ఈ విత్తనాలను తింటే మూత్రాశయ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అని అంటారు. అధిక బరువును తగ్గించడంలోనూ గుమ్మడికాయ విత్తనాలు ఎంతో మేలు చేస్తాయివీటిలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఈ విత్తనాలను తింటే ఆకలి అదుపులో ఉంటుంది. దీని వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఇలా అనేక ప్రయోజనాలను ఈ గుమ్మడి విత్తనాలలో ఉండటం వలన వీటిని తినడం ఎంతో శ్రేయస్కరం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: