బ్యాక్ పెయిన్‌ ఇబ్బంది పెడుతోందా.. ఇదిగో పరిష్కారం..?

బ్యాక్ పెయిన్.. ఇప్పుడు చాలా సాధారణ సమస్యగా మారింది. ప్రత్యేకించి ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పనిచేసేవారు... ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో పదుల కిలోమీటర్లు బైకులపై వెళ్లేవారు ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్ బారిన పడుతుంటారు. ఈ బ్యాక్ పెయిన్ పరిష్కారం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటారు.



ఐతే.. సమర్థవంతమైన అలవాట్ల ద్వారా బ్యాక్ పెయిన్ ను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. ప్రతిసారీ ఎక్స్ రేలు తీయించుకోవడం, స్కానింగ్‌లు చేయించుకోవడం, వైద్య నిపుణుల కోసం పరుగులు పెట్టడం కాకుండా జీవనశైలి మార్చుకోవడం ద్వారా ఈ బ్యాక్ పెయిన్‌కు చెక్ పెట్టొచ్చంటున్నారు.



బ్యాక్ పెయిన్ ను తగ్గించుకునే మార్గాల్లో యోగా ముందు వరుసలో ఉంటోంది. రోజూ కనీసం అరగంట నుంచి గంట సేపు యోగా చేయగలిగితే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుందట. యోగా వల్ల దాదాపు 32 డిస్కులు ప్రభావితం అవుతాయట. యోగాతో పాటు ప్రాణాయామం కూడా చేస్తే మానసికంగానూ ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఈత కూడా బ్యాక్ పెయిన్ ను తగ్గిస్తుంది.



గంటల తరబడి ఆఫీసుల్లో పనిచేసేవారు.. కనీసం గంటకోసారి బ్రేక్ తీసుకుని ఆఫీసులోనే అటూ ఇటూ నడవాలి. పొగతాగే అలవాటు మానుకోవడం, బరువు తగ్గించుకోవడం కూడా చేస్తే ఈ బ్యాక్ పెయిన్ బారి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఉదయపు నడక, జాగింగ్ వంటి వ్యాయామాల ద్వారా కూడా బ్యాక్ పెయిన్ నుంచి విముక్తులు కావచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: