హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు అమరావతి దెబ్బ పడుతుందా?
2004 ఎన్నికల్లో వైఎస్సార్ అండతో ఉదయభాను మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. అయితే అప్పుడే ఆయనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు గానీ, అది వర్కౌట్ కాలేదు. వైఎస్సార్ ఆయనకు విప్ ఇవ్వడంతో, దానితో సరిపెట్టుకున్నారు. తర్వాత 2009 ఎన్నికల్లో ఉదయభాను టీడీపీ నేత శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) చేతిలో ఓడిపోయారు.
ఇక 2014 ఎన్నికల్లో సామినేని వైసీపీ నుంచి పోటీ చేసి మళ్ళీ తాతయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే జగన్ గాలి ఉన్నా సరే 2019 ఎన్నికల్లో ఉదయభాను స్వల్ప మెజారిటీ తేడాతో గెలిచారు. మూడోసారి ఎమ్మెల్యే కావడంతో మంత్రి పదవి వస్తుందని ఉదయభాను ఆశించారు గానీ, సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా మళ్ళీ ఆయనకు పదవి మిస్ అయింది. మంత్రి పదవి రాకపోయినా విప్ పదవి మాత్రం దక్కింది.
ఎమ్మెల్యేగా జగ్గయ్యపేటలో ఉదయభాను బాగానే కష్టపడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ఎలాంటి లోటు లేకుండా అందేలా చూస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అటు టీడీపీ తరుపున తాతయ్య కూడా గట్టిగానే కష్టపడుతున్నారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తోడుగా ఉంటున్నారు.
నియోజకవర్గంలో సమస్యలపై పోరాడుతున్నారు. సీనియర్ నేత నెట్టెం రఘురాంతో కలిసి పార్టీని బలోపేతం చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అలాగే అమరావతికి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడి ప్రజలు మూడు రాజధానుల వైపు పెద్దగా మొగ్గు చూపడం లేదు. దీని వల్ల టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశముంది. అలాగే సామినేనికి కాస్త మైనస్ అయ్యేలా కనిపిస్తోంది. కాకపోతే సంక్షేమ పథకాలు సామినేనికి బాగా ప్లస్ అవుతున్నాయి.